AP Elections: ఏపీ ఎన్నికలలో వారసులు హిట్టా..? ఫట్టా..? ప్రజలు వీరిని ఆదరించడం సాధ్యమేనా?

AP Elections:  ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఈసారి వారసులకు పెద్దపీట వేశారు. ఇప్పటికే అధికార పక్షంలోనూ అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల వారసులకు పలు ప్రాంతాలలో టికెట్లు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈసారి ఎన్నికలలో పోటీ చేయబోయే వారసులు ఏ విధమైనటువంటి విజయం అందుకుంటున్నారు ప్రజలను వీరిని ఏ స్థాయిలో ఆదరిస్తారన్న విషయంపై ఆసక్తి నెలకొంది.

ఇప్పటికే అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి పలువురు వారసులు రంగంలోకి దిగుతున్నారు. వీరితోపాటు అక్కడక్కడ పలువురు మహిళల కోటా కింద మహిళ అభ్యర్థులు కూడా రంగంలోకి దిగుతున్నారు. మరి ఈ పోటీలో విజయం ఎవరు సొంతం చేసుకుంటున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది. మరి కొత్తగా ఎంట్రీ ఇవ్వబోతున్నటువంటి ఆ వారసులు ఎవరు అనే విషయానికి వస్తే..

అధికార పార్టీలో కొనసాగుతున్నటువంటి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వారసుడిగా అభినయ్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి, బందరు ఎమ్మెల్యే పేర్ని నాని కుమారుడు క్రిష్ణమూర్తి, రామచంద్రాపురం ఎమ్మెల్యే పిల్లి సుభాష్ కుమారుడు సూర్యప్రకాష్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా కుమార్తె ఫాతిమాకు వైసీపీ అవకాశం ఇచ్చింది. గుంటూరు, బందరు మినహాయిస్తే చంద్రగిరి, తిరుపతి, రామచంద్రాపురంలలో పరిస్థితులు ఆశాజనకంగా లేవని తెలుస్తున్నది.

మరోవైపు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున వారసులు ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.కోవూరు నుండి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతిరెడ్డికి, ప్రత్తిపాడు నుండి ఇటీవల మరణించిన వరపుల రాజా సతీమణి సత్యప్రభకు, వెంకటగిరి నుండి మహిళాకోటాలో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామక్రిష్ణ కుమార్తె లక్ష్మీప్రియకు, శ్రీకాళహస్తి నుండి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డికి, కమలాపురం నుండి పుత్తా నరసింహారెడ్డి కుమారుడు చైతన్యరెడ్డికి, పుట్టపర్తి నుండి పల్లె రఘునాథరెడ్డి కోడలు సింధూరరెడ్డికి, కదిరి నుండి మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ సతీమణి యశోదాదేవికి అవకాశం కల్పించారు. మరి ఈ వారసులను ప్రజలు ఏ స్థాయిలో ఆదరిస్తారు అనేది తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -