Allu Arha: బన్నీ కూతురికి అదృష్టం మామూలుగా లేదుగా!

Allu Arha: సూపర్ స్టార్ మహేష్ బాబుకు గతేడాది ఏమాత్రం కలసిరాలేదు. ఆయన నటించిన ‘సర్కారు వారి పాట’ ఓ మోస్తరు విజయాన్ని సాధించింది. ఈ సినిమా తర్వాత కొంత గ్యాప్ ఇచ్చిన ప్రిన్స్.. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ మూవీకి ఓకే చెప్పారు. ‘ఎస్ఎస్ఎంబీ 28’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

 

సోదరుడు రమేష్ బాబు, తండ్రి కృష్ణతోపాటు తల్లి ఇందిరను కోల్పోయిన బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మహేష్.. ఎట్టకేలకు త్రివిక్రమ్ మూవీ షూట్ లో జాయిన్ అయ్యారు. వీళ్లిద్దరి కాంబోలో రానున్న మూడో సినిమా ఇదే. మహేష్ కు ఉన్న పాన్ ఇండియా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఫిక్స్ అయ్యారు.

 

ప్రత్యేక పాత్రలో ఐకాన్ స్టార్ కూతురు!
‘ఎస్ఎస్ఎంబీ 28’లో మహేష్ బాబు రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమాను పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో త్రివిక్రమ్ తీస్తున్నారని వినికిడి. ఈ మూవీకి సంబంధించి ఇప్పుడో మరో ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ‘ఎస్ఎస్ఎంబీ 28’లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్హా నటించనున్నారట.

 

మహేష్ మూవీలో ఓ ప్రత్యేక పాత్రలో అర్హా నటిస్తే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. అయితే, ఈ న్యూస్ మీద ఇప్పటివరకు అధికారిక సమాచారం రాలేదు. మరోవైపు, బన్నీ–మహేష్ ఫ్యాన్స్ మాత్రం అర్హా ఈ సినిమాలో కనిపిస్తే బాగుంటుందని అంటున్నారు. ఒకవేళ నటిస్తే మాత్రం ఎప్పటికీ నిలిచిపోయేలా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి, సూపర్ స్టార్ మహేష్ మూవీలో పాన్ ఇండియా స్టార్ బన్నీ కూతరు అర్హా నటిస్తారో లేదో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -