Allu Arjun-Pawan Kalyan: పవన్ కు విష్ చేయని బన్నీ.. కారణం ఇదే అంటున్న నెటిజన్స్!

Allu Arjun-Pawan Kalyan: టాలీవుడ్ ప్రేక్షకులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తక్కువ సినిమాలో నటించినప్పటికీ.. వందల కొద్ది సినిమాల్లో నటించిన క్రేజ్ తన సొంతం. తన అద్భుతమైన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక తన ప్రత్యేకమైన యాటిట్యూడ్ తో ఎంతోమంది అభిమానులను తన సొంతం చేసుకున్నాడు.

మొత్తానికి పవన్ కళ్యాణ్ టాలీవుడ్ అగ్రస్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు. అంతేకాకుండా రాజకీయ పరంగా కూడా బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఆయన రాజకీయాల్లో మార్పు కోసం చాలా కష్టపడుతున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కాగా ఈ సినిమాకు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. ఇక పవన్ అభిమానులు మాత్రం ఈ సినిమా కోసం కండ్లు కాయలు కచేలా ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉండగా నిన్న అనగా సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే. ఇక పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా తాను నటించే హరిహర వీరమల్లు సినిమా గ్లింప్స్ నిన్న విడుదల చేశారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కు చాలామంది సెలబ్రేటీలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కానీ అల్లు అర్జున్ మాత్రం సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన జాడ కనిపించలేదు.

సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండే బన్నీ.. పవన్ కళ్యాణ్ కు ఎందుకు విష్ చేయలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ బన్నీ ఫ్యాన్స్ మాత్రం ఈ విధంగా ఆ విమర్శలను కొట్టి పాడేశారు. సోషల్ మీడియాలో తెలపనంతమాత్రాన.. విష్ చేయనట్టేనా.. ఫోన్ చేసి తెలిపి ఉండొచ్చు గా అన్నట్లు కొట్టి పడేశారు. కానీ ఓవైపు అల్లు, మెగా ఫ్యామిలీ మధ్య గ్యాప్ వచ్చినందుకేనేమో అని అంటున్నారు. మరి ఈ విమర్శల గురించి అల్లు అర్జున్ ఏ విధంగా స్పందిస్తాడో వేచి చూడాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -