Ambati Rambabu: అతి చేస్తున్న అంబటి.. పవన్ ఫ్యాన్స్ ను మరీ ఇంతలా కెలకడం అవసరమా అంటూ?

Ambati Rambabu: బ్రో సినిమాలో మంత్రి అంబటిని అన్యాపదేశంగా కాస్త వెటకారం చేసారు. అతని వ్యక్తిగత వ్యవహారాలను కాదు. జస్ట్ డ్యాన్సింగ్ స్టయిల్ ను. నిజానికి వందలో యాభై మందికి కూడా అది అంబటినీ ఉద్దేశించి అతని స్టైల్ అనుకరించి చేశారని తెలియదు కానీ ఈ వ్యవహారంపై మంత్రి అంబటి చాలా సీరియస్ గా తీసుకొని ఏకంగా సినిమాపై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. ఇలా ఈ సినిమాపై అంబటి ప్రస్తావిస్తూ తన గౌరవాన్ని దిగదార్చుకుంటున్నారనే చెప్పాలి.

సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తావించడమే కాకుండా సినిమా కలెక్షన్ల గురించి బహిరంగంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అదేవిధంగా ఈ సినిమా ఆర్థిక లావాదేవీల పై ఏకంగా ఈడీకి ఫిర్యాదు చేస్తామంటూ ఢిల్లీ బయలుదేరడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇది రాజకీయానికి సంబంధించిన సినిమా కూడా కాదు. మామూలు సినిమా. లేదా మంచి మెసేజ్ సినిమా. ఇక్కడ అలా చేయడం వరకు మేకర్ల తప్పు.

 

ఇక ఈయన తనకు తాను తనకేదో అన్యాయం జరిగిపోయింది అంటూ కింద మీద పడుతూ మీడియా సమావేశాలలో సంచలన వ్యాఖ్యలు చేయడం అలాగే ఢిల్లీ వెళ్లి ఈడికి ఫిర్యాదు చేయడం అందరిని కొంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నిర్మాతలకు తెలియదా.. ఈడి, ఇన్ కమ్ టాక్ వంటి చట్టాల గురించి. అంతర్జాతీయంగా వ్యాపారాలు చేస్తున్న వాళ్లు వారు. వారి జాగ్రత్తలు వారికి వుండవా అంటుకొందరు అంబటి వ్యాఖ్యలపై కౌంటర్ ఇస్తున్నారు.

 

బ్రో సినిమా నిర్మాత బిజెపికి మంచి అనుచరుడు ఇక పవన్ కళ్యాణ్ కూడా బిజెపితో పొత్తు కుదుర్చుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా బిజెపికి అనుకూలంగా ఉన్నటువంటి వారిపై వైఎస్ఆర్సిపి మంత్రి ఫిర్యాదు చేయడం వల్ల వచ్చే లాభం ఏమీ లేదు సినిమాకు మంచి మైలేజ్ ఇవ్వడం తప్ప.ఈ విధంగా అంబటి రాంబాబు తరచూ ఈ సినిమా గురించి ప్రస్తావిస్తూ పవన్ ఫ్యాన్స్ ని గెలకారు అయితే పవన్ అభిమానులు కూడా మంత్రి అంబంటికి బాగానే కౌంటర్ ఇస్తున్నారు. ఈ సమయంలోనే ఈ సినిమా కూడా భారీ స్థాయిలో ప్రమోట్ అవుతుందనే చెప్పాలి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -