Minister Ambati: పవన్ పై అంబటి అదిరిపోయే పంచ్.. ఏమైందంటే?

Minister Ambati: జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనకు సీఎం అయ్యే అర్హత లేదని స్వయంగా ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. దాంతో పవన్ కళ్యాణ్ పై జనసైనికులతోపాటు అధికార వైసీపీ నుండి విమర్శలు గుప్పిస్తున్నారు. కేవలం చంద్రబాబు కోసమే పవన్ రాజకీయాల్లోకి వచ్చాడని అందుకోసమే ముందే సీఎం అయ్యే అర్హత నాకు లేదని ప్రకటించుకొని జన సైనికులు అందరూ టీడీపీ లో చేరమని చెప్పకనే చెప్పారు అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.

న‌న్ను సీఎంని చేయాల‌ని టీడీపీ, బీజేపీని అడ‌గ‌ను వైసీపీని అధికారంలో నుంచి దించాలన్న‌దే త‌మ ల‌క్ష్యం అంటూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పై మంత్రి అంబటి రాంబాబు అదిరిపోయే పంచ్ వేశారు. సీఎం పదవి వద్దంటే.. ప్యాకేజి తోనే సర్దుకుంటావా ప‌వ‌న్ అంటూ ట్వీట్ చేశారు. కాగా ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌తో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ జ‌న‌సేన పొత్తు ప‌క్కా అని తేలిపోయింది. బీజేపీ కూడా రావాల‌ని ఢిల్లీ పెద్ద‌ల‌తో చ‌ర్చలు కూడా జ‌రిపారు. ఒక వేళ బీజేపీతో క‌లిసి రాక‌పోతే ప‌వ‌న్ చంద్ర‌బాబు తోనే క‌లిసి వెళ్లే అవ‌కాశం ఉంది.

 

గతంలో కూడా ప్యాకేజీ తీసుకొని టీడీపీ కోసం పని చేశారంటూ వస్తున్న వార్తలను నిజం చేసేలా పవన్ కళ్యాణ్ అలా ప్రవర్తిస్తున్నారు. రాయలసీమలో తమకు బలం లేదని కేవ‌లం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తమకు బలం ఉందని స్వయంగా ప్రకటించుకున్న పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు ఎలా చేసుకుంటారో తెలియాల్సి ఉంది..

Related Articles

ట్రేండింగ్

YCP-TDP: చంద్రబాబు అరెస్ట్ తో రగిలిపోతున్న టీడీపీ.. అరెస్ట్ పై వైసీపీ రియాక్షన్ ఏంటంటే?

YCP-TDP:  చంద్రబాబు నాయుడుని ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏం చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టిన సందర్భంగా పండగ చేసుకుంటూ బాగా...
- Advertisement -
- Advertisement -