Ambati Rayudu: జనసేన అధినేతతో భేటీ అయిన అంబటి రాయుడు…

Ambati Rayudu: ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయ ప్రవేశం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రజాసేవ చేయడానికి తాను మంచి పార్టీలో చేరతానని గతంలో రాయుడు తెలిపారు. గత కొద్ది రోజుల క్రితం వైసీపీకి అనుకూలంగా రాయుడు పోస్టులు పెట్టేవారు. అందరూ రాయుడు వైసీపీలో చేరుతున్నారు అనుకున్నారు. అనుకున్నట్టుగానే గతవారం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నాడు. గుంటూరు నుండి ఎంపీ స్థానంలో రాయుడు పోటీ చేస్తాడు అని వాదన వినిపించింది.

 

అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ పార్టీలో చేరిన కొద్ది రోజులకే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు రాయుడు ప్రకటించాడు. తను రాజకీయాలకు కొద్ది రోజులు దూరంగా ఉండాలి అనుకుంటున్నాట్లు చెప్పాడు. అసలు రాయుడు వెంటనే రాజీనామా చేయడానికి గల కారణం ఏంటి అని ఆరా తీస్తే…. జగన్మోహన్ రెడ్డి రాయుడికి ముందుగా ఎంపీ సీట్లు ఇస్తానని పిలిపించుకునే పార్టీలోకి చేరిన తర్వాత మాట మార్చేశారట. పైగా పార్టీకి డొనేషన్ కింద ఎక్కువ శాతం డబ్బును అడిగారట. జగన్మోహన్ రెడ్డి మాటలకు ప్రవర్తనకు మనస్థాపం చెందిన రాయుడు వెంటనే పార్టీకి రాజీనామా చేసి బయటికి వచ్చేసాడు.

తన ఆలోచనలకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు చాలా తేడా ఉందని తాను ప్రజాసేవ చేయాలనుకుంటున్నారని అది వైసీపీతో ఉంటే జరిగే పని కాదని రాయుడు ప్రకటించాడు. అయితే వెంటనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని రాయుడు కలిశాడు. పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించాడు. తాను అనుకున్నది సాధించాలి ప్రజలకు సేవ చేయాలంటే జనసేన సరైన దారి అని… తాను ముందు అనుకున్న ఆలోచనలు తప్పు అని చెప్పుకొచ్చాడు.

 

అయితే గత కొద్ది రోజులుగా రాయుడి విషయాన్ని గమనిస్తున్న ప్రజలు అందరూ ఒకే మాట అంటున్నారు. ప్రజాసేవ చేయాలనుకునేవాడు వైసిపిలోకి ఎందుకు వెళ్ళాడు అని చాలామంది బాధపడ్డారు.అయితే రాజీనామా చేసి జనసేనలో చేరడంతో సరైన నిర్ణయం తీసుకున్నాడని మెచ్చుకున్నారు. అసలు జగన్ మోహన్ రెడ్డి ప్రవర్తన గురించి రాయుడికి వెంటనే తెలియడం మంచి పని అయిందని అంటున్నారు. వైసీపీ అలాంటి పార్టీయో రాయుడు విషయాన్ని గమనిస్తే అర్థమవుతుందని
ప్రతిపక్ష పార్టీలు కూడా కౌంటర్ వేస్తున్నాయి.

 

అయితే రాబోయే ఎన్నికల్లో రాయడం జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తాడా లేదా అనే విషయపైన స్పష్టత లేదు. పూర్తి వివరాలు అన్ని త్వరలోనే వెల్లడిస్తానని రాయుడు చెప్పాడు. రాయుడు జనసేన తరపున ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కచ్చితంగా గెలుస్తాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే రాయుడు బయటికి వెళ్లిన వెంటనే వైసీపీ నాయకులు రాయుడిపైన విమర్శలు చేయడం మొదలుపెట్టారు. పార్టీలో చేరినప్పుడు జగన్ మోహన్ రెడ్డి పనులకు క్రికెటర్లు సైతం ఆకర్షితులయ్యని చెప్పుకున్న వైసీపీ నాయకులు వెంటనే రివర్స్ గేర్ వేయడం నువ్వుల పాలవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -