Amit Shah – Ramoji Rao: రామోజీరావుతో అమిత్ షా భేటీ ఎందుకు?

Amit Shah – Ramoji Rao: మునుగోడు ఉపఎన్నిక మరింత రసవత్తరంగా మారుతోంది. ఉపఎన్నికకు షెడ్యూల్ రాకముందే రాజకీయ పార్టీలు హీట్ పెంచేశాయి. పార్టీలన్నీ రంగంలోకి దిగి మునుగోడులోనే మకాం వేశాయి. ఎన్నికల ప్రచారాన్ని ఇప్పటినుంచే మొదలుపెట్టాయి. కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే మునుగోడు నియోజకవర్గానికి మండలాల వారీగా ఇంచార్జ్ లను ప్రకటించింది. మండలాల్లో తిరగాలని, ప్రచారం నిర్వహించాలని తెలిపింది. ఇక టీఆర్‌ఎస్ తరపున మంత్రి జగదీశ్వర్ రెడ్డి నియోజకవర్గంలో అన్ని తానై పర్యవేక్షిస్తున్నారు. ఇతర పార్టీల నేతలపై పార్టీలన్నీ కన్నేశాయి. తమవైపు తిప్పుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నాయి.

శనివారం సీఎం కేసీఆర్ ప్రజాదీవెన పేరుతో మునుగోడులో నిర్వహించిన బహిరంగ సభతో రాజకీయం మరింత హీటెక్కుతోంది. ఆదివారం మునుగోడులో కేంద్ర హోంశాఖ అమిత్ షా బహిరంగ సభతో ఉపఎన్నికకు బీజేపీ శమరసంఖం పూరించనుంది. అమిత్ షా మీటింగ్ తర్వాత బీజేపీ మరింత స్పీడ్ పెంచనుంది. నియోజకవర్గ వ్యాప్తంగా ఓటర్లందరినీ కలుసుకోనుంది. ప్రభుత్వ వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లనుంది. కాంగ్రెస్, బీజేపీకి ఈ ఉపఎన్నిక జీవన్మరణ సమస్యగా మారింది. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి అమిత్ షా ఒత్తిడితో రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీ ఈ స్థానాన్ని గెలుచుకోవాల్సిన అవసరం ఉంటుంది.

ఇక సిట్టింగ్ స్థానం కావడంతో కాంగ్రెస్ కూడా ఇక్కడ గెలవాల్సి ఉంటుంది. ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే ఉండటంతో ఈ ఉపఎన్నికలో గెలవకపోతే కాంగ్రెస్ ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది. నల్లొండ జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉంది. కాంగ్రెస్ కు ఎప్పటినుంచో కంచుకోటగా ఈ జిల్లా ఉంది. ఇప్పుడు ఇక్కడే ఓడిపోతే కాంగ్రెస్ మరింత బలహీన పడే అవకాశం ఉంది. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ కంచుకోటలో జరుగుతున్న ఉపఎన్నిక కావడంతో ఆయనకు ఇది మరింత ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ పీసీసీ పదవికి ఇది ఒిక పరీక్షగా మారింది. దీంతో బీజేపీ, కాంగ్రెస్ కు ఈ ఉపఎన్నిక సవాల్ గా మారనుంది.

నల్లొండ జిల్లాలో టీఆర్ఎస్ కు అంత బలం లేదు. అంతేకాకుండా మునుగోడు టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కూడా కాదు. దీంతో టీఆర్ఎస్ ఓడిపోయినా పెద్దగా ఓరిగేది ఏమీ ఉండదు. కానీ ఉపఎన్నికలలో సాధారణంగా అధికార పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. చేతుల్లో అధికారం ఉంటుంది కనుక వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ఆశ చూపి ఓట్లు పొందే అవకాశం ఉంటుంది. దీంతో ఈ ఉపఎన్నికలో గెలిచి జాతీయ పార్టీలకు షాక్ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ గెలిస్తే ఆ పార్టీకి బోనస్ సీటు అని చెప్పుకోవచ్చు.

దీంతో టీఆర్ఎస్ కూడా ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలో మూడు పార్టీల మధ్య త్రిముఖ పోరు జరగనుంది. యుద్దంలా మునుగోడు ఉపఎన్నికను ఈ మూడు పార్టీలు భావిస్తున్నాయి. వచ్చే ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావిస్తున్నారు. అందువల్ల పార్టీలన్నీ ఇక్కడ గెలుపొందేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించగా.. రేపు అమిత్ షా సభ నిర్వహించనున్నారు. దీని కోసం హైదరాబాద్ రానున్న అమిత్ షా.. ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావుతో భేటీ కానుండటం హాట్ టాపిక్ గా మారింది. అమిత్ షా ఒక్కరే రామోజీరావుతో ఏకాంతంగా భేటీ కానున్నాయి. ఈ భేటీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

రామోజీరావుతో అమిత్ షా ఏం చర్చిస్తారనేది ఉత్కంఠ రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో మీడియా పరంగా మద్దతు ఇవ్వాలని అమిత్ షా కోరతారని విశ్లేషకులు భావిస్తున్నారు. అమిత్ షా, రామోజీరావు మధ్య దగ్గర సంబంధాలు ఉన్నారు. గతంలో కూడా తెలంగాణ పర్యనటకు వచ్చినప్పుడు రామోజీరావును అమిత్ షా కలిశారు. దీంతో ఇప్పుడు వీరిద్దరు భేటీ ఇప్పుడు హాట్ టాపిక్ గా నడుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Janasena Complaint on YS Jagan: ఏపీ ఎన్నికల సంఘం దృష్టికి పవన్ పెళ్లిళ్ల గోల.. జగన్ కు భారీ షాక్ తప్పదా?

Janasena Complaint on YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమానికి వెళ్లిన ఏ సభకు వెళ్లిన అక్కడ పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావనకు తీసుకువస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్...
- Advertisement -
- Advertisement -