Anasuya: విరహవేదనతో కవిత చెప్పిన అనసూయ.. వింటే షాకవ్వాల్సిందే!

Anasuya: తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అవసరం లేని పేరు ‘యాంకర్ అనసూయ’. బుల్లితెర నుంచి వెండితెరపై అడుగుపెట్టిన అనసూయకు ప్రస్తుతం కష్టకాలం నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రముఖ బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ నుంచి బయటికి వెళ్లాక.. అనసూయకు ఆఫర్లు తగ్గాయనే చెప్పవచ్చు. ఆడపాదడపా సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తోంది. అయితే అనసూయ ఏం చేసినా సంచలనమేనని అని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో అనసూయ వైఖరి పూర్తిగా మారినట్లు కనిపిస్తోంది. వివాదాలతోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంటోంది. సోషల్ మీడియాలో తనదైన శైలీలో కౌంటర్ ఇస్తూ.. నెటిజన్లకు బదులిస్తుంటారు. తాజాగా ఆమె కవిగా అవతారమెత్తినట్లు కనిపిస్తోంది. తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో తన విరహ వేదనను తెలియజేస్తూ.. ఓ కవితను రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

 

 

అనసూయ రాసిన కవితను చూస్తే.. ఆమె ఎవరి ప్రేమలో మునిగినట్లు అనిపిస్తోంది. ఆమె రాసుకొచ్చిన పదాలు గుండెలను హత్తుకునేలా ఎంతో డీప్‌గా ఉన్నాయి. యంగ్ ఏజ్‌లో రావాల్సిన ఆలోచనలు, ఫీలింగ్స్ అనసూయకకు ఇప్పుడు ఎందుకు వచ్చాయో తెలియడం లేదని అభిమానులు షాక్ అవుతున్నారు. అసలు ఎవరి కోసం అనసూయ కవితను రాసుకొచ్చిందో.. ఆయన ఎవరో ఆమె వేదనను అర్థం చేసుకుని.. విరహ వేదనను తగ్గించాలని అంటున్నారు.

 

 

అయితే అనసూయ తన పోస్టులో ఏం రాసుకొచ్చిందని అనుకుంటున్నారా?. అనసూయ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో.. ‘మది దాచుకున్న రహస్యాన్ని వెతికేటి నీ చూపునాపేదెలా.. నీ నీలి కన్నుల్లో పడి మునకలేస్తున్న నా మనసు తేలేదెలా.. గిలిగింతలు పెడుతున్న నీ చిలిపి తలపులతో ఏమో ఎలా వేగడం’ అంటూ రాసుకొచ్చింది. ఎండ్‌లో లవ్‌కు సంబంధించిన ఎమోజీని పెట్టింది. అలాగే బెడ్‌పై బోర్లా పడుకుని రొమాంటిక్ ఫోటో షేర్ చేసింది. కాగా, అనసూయ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇంటర్ చదివే రోజుల్లోనే ఓ ఎన్‌సీసీ క్యాంపులో భరద్వాజ్‌తో అనసూయకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు సంతోషంగా కాలం వెళ్లదీస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -