Anchor Vishnupriya: నా ఫేస్ బుక్ పేజ్ హ్యాక్ అయింది.. క్షమించండి: విష్ణు ప్రియ

Anchor Vishnupriya: బుల్లితెర యాంకర్ గా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విష్ణు ప్రియ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఇలా యాంకర్ గా తన ప్రస్థానం మొదలుపెట్టిన ఈమె పలు బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ సందడి చేశారు. తాజాగా వాంటెడ్ పండుగాడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేక పోయింది. ఇకపోతే విష్ణు ప్రియ తాజాగా బిగ్ బాస్ మానస్ తో కలిసి చేసినటువంటి ఒక ప్రైవేట్ వీడియో బాగా వైరల్ అవుతుంది.

ఈ విధంగా ప్రవేట్ వీడియో సాంగ్స్ చేస్తూ సందడి చేస్తున్న విష్ణు ప్రియ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు. ఇక ఈమె కూడా హీరోయిన్ రేంజ్ లో గ్లామర్ ఫోటోషూట్ చేసి ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటారు. అయితే ఒక్కసారిగా ఈమె ఫేస్ బుక్ పేజ్ నుంచి మహిళలకు సంబంధించిన అశ్లీల ఫోటోలు కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి.

ఈ విధంగా విష్ణుప్రియ ఫేస్ బుక్ నుంచి ఇలాంటి అశ్లీల ఫోటోలు రావడంతో ఒక్కసారిగా అభిమానులు కంగు తిన్నారు. అయితే ఈ విషయంపై విష్ణుప్రియ స్పందిస్తూ అందరికీ క్లారిటీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఈమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఎవరో తన ఫేస్ బుక్ పేజ్ హ్యాక్ చేశారని తెలిపారు. గత రెండు నెలల క్రితం తన ఫేస్ బుక్ పేజ్ హ్యాక్ చేశారని ఈమె వెల్లడించారు. ఇంకా ఈ అకౌంట్ నా చేతికి రాలేదని ఎవరో తన ఫేస్ బుక్ పేజ్ ను ఇలా మిస్ యూస్ చేస్తున్నారంటూ ఈమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలా ఇప్పటికే రెండుసార్లు జరిగింది ప్రతి ఒక్కరూ ఆపేజ్ ను రిపోర్ట్ చేయండి. అన్ ఫాలో చేయండి నా ఫేస్ బుక్ పేజ్ నుంచి ఇలాంటి అశ్లీల ఫోటోలు వీడియోలు రావడం అందరిని ఇబ్బందులకు గురి చేసి ఉంటుంది మనస్ఫూర్తితో క్షమించండి. ఇక ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి అంటూ ఈ సందర్భంగా విష్ణు ప్రియ ఫేస్ బుక్ పేజ్ హ్యాక్ అయిన విషయాన్ని తెలియచేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -