Chandrababu Bail: చంద్రబాబుకు వచ్చింది అలాంటి బెయిల్ మాత్రమే.. టీడీపీ శ్రేణులు మరీ పొంగిపోవద్దంటూ?

Chandrababu Bail: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ స్కామ్ లో భాగంగా అరెస్ట్ అయిన సంగతి మనకు తెలిసిందే. దాదాపు 53 రోజులపాటు ఈయన రాజమండ్రి జైలులో ఉన్నారు. అయితే తాజాగా ఈయనకు అరెస్ట్ విషయంలో కాస్త ఉపశమనం లభించిందని చెప్పాలి. తాజాగా కోర్ట్ చంద్రబాబు నాయుడుకి మధ్యంతర బెయిల్ ప్రకటించింది. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు జైలు నుంచి బెయిల్ మీద బయటకు వస్తున్నారు. ఇక చంద్రబాబుకు కేసు మెరిట్స్ మీద బెయిల్ రాలేదు కేవలం ఆయన ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మద్యంతర బెయిల్ ప్రకటించింది.

దాదాపు జైలులో అర్థ శత దినోత్సవాన్ని జరుపుకున్నటువంటి చంద్రబాబు నాయుడుకు ఇన్ని రోజులకు ఉపశమనం లభించింది. అయితే ఈయన బెయిల్ కూడా ఎన్నో కండిషన్లతో కూడుకున్నదని తెలుస్తోంది. నేడు సాయంత్రం నాలుగు గంటలకు చంద్రబాబు నాయుడు బెయిల్ మీద బయటకు రానున్నారు. అయితే తిరిగి నవంబర్ 28వ తేదీ ఈయన జైలులో సరెండర్ కావాలని కోర్టు తీర్పు వెల్లడించింది.

*ఈ విధంగా బెయిల్ మీద బయటకు వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడుకి కోర్టు పలు ఆంక్షలు విధించారు. అయితే ఈయన బయటకు వచ్చిన తర్వాత ఈ కేసుకు సంబంధించిన వారితో ఎలాంటి సంప్రదింపులు చేయకూడదు.

*ఇక ఈ కేసును అడ్డుపెట్టుకొని ఎలాంటి రాజకీయ ప్రసంగాలలోనూ చంద్రబాబు నాయుడు పాల్గొనకూడదు ఈయన కేవలం ఇంటికి ఆసుపత్రికి మాత్రమే పరిమితం కావాలని తెలిపారు.

*ఇక హాస్పిటల్లో ఈయన చికిత్స కోసం అయ్యే ఖర్చును ఆయనే భరించుకోవాలని అందుకు సంబంధించిన రిపోర్ట్స్ అన్నింటిని జైలు సూపర్డెంట్ కి పంపించాలని కోర్టు షరతులు విధించింది.

*ఇక చంద్రబాబు నాయుడుతో పాటు ఇద్దరు డిఎస్పీ లను పంపించాలి అని ప్రభుత్వం కోరడంతో అందుకు సంబంధించి పిటిషన్ దాఖలు చేయాలని కోర్టు వెల్లడించారు.

*చంద్రబాబు నాయుడుకి జెడ్ ప్లస్ సెక్యూరిటీ విషయంలో కేంద్రం అమలు చేసిన నిబంధనలను ఫాలో కావాలని అలాగే ఆయన సొంత సెక్యూరిటీ విషయంలో కోర్టు జోక్యం ఉండదని వెల్లడించారు.

ఈ విధమైనటువంటి షరతులను విధిస్తూ కోర్టు చంద్రబాబు నాయుడుకి మద్యంతర బెయిల్ ప్రకటించింది. ఇలా ఈయన బెయిల్ సమయం ముగిసిపోయిన వెంటనే స్వయంగా వచ్చి జైలులో సరెండర్ కావాలని కోర్టు తెలియజేసింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -