Anil Kumar Yadav: పవన్ పై అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు.. ఏం జరిగిందంటే?

Anil Kumar Yadav: ప్రస్తుతం ఏపీలో పవన్ కళ్యాణ్ పేరు సంచలనంగా మారింది. ఏపీలోని వాలంటీర్ల వ్యవస్థ పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే పవన్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. పవన్ దిష్టిబొమ్మలను తగలబెడుతూ మహిళా వాలంటీర్లు రోడ్లపై పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు. అయితే తాజాగా పవన్ వ్యాఖ్యలపై హోం మంత్రి తానేటి వనిత స్పందించారు. పవన్ కల్యాణ్ తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమెన్ ట్రాఫికింగ్ పై తన దగ్గరున్న వివరాలను పవన్ బయటపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు.

కరోనా కష్ట సమయంలో వాలంటీర్లు వెలకట్టలేని సేవలు చేశారని ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేసిన గుర్తు చేశారు. ఉభయగోదావరి జిల్లాలకే పవన్ ను చంద్రబాబు పరిమితం చేశారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ విమర్శించారు. పవన్ ను చంద్రబాబు ట్రాప్ చేశారని, అందుకే వాలంటీర్లపై ఆ విధంగా వ్యాఖ్యలు చేశారని అన్నారు. వాలంటీర్లపై పవన్ నీచమైన వ్యాఖ్యలను చేశారు అంటూ మండిపడ్డారు. ఇక, వాలంటీర్లపై పవన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు. బుద్ధున్నవారు ఇలా మాట్లాడరని, పనికిమాలిన వ్యక్తులే ఇలాంటి బుర్ర లేని మాటలు మాట్లాడతారని అన్నారు.

 

పిచ్చి మాటలు మానుకోవాలని పవన్ కు హితవు పలికారు. కేకలు వేయడం, తొడగొట్టడం సినిమాల్లో చెల్లుతాయని రాజకీయాల్లో చెల్లవని అన్నారు. ఇక, రాష్ట్రంలో రెండున్నర లక్షల మంది వాలంటీర్లను కించపరిచేలా మాట్లాడడం సరికాదని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సైతం మండిపడ్డారు. కొందరు వాలంటీర్లు తప్పు చేస్తే అందర్నీ విమర్శించడం సరికాదని చెప్పారు. జనసైనికులు ఎక్కడైనా తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ తప్పు చేసినట్లా అని ప్రశ్నించారు. జనసైనికులు గంజాయి తాగుతూ దొరకలేదా, గొడవలు చేయలేదా అని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో వాలంటర్ల సత్తా ఏంటో చూపిస్తారని, పవన్ కు రాష్ట్రంలోని మహిళలు బుద్ధి చెబుతారని అన్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -