Anil Ravipudi: రాజమౌళి తర్వాత ఆ ఘనత సాధించిన ఏకైక మగాడు అనిల్ రావిపూడి మాత్రమేనా?

Anil Ravipudi:  దర్శక దిగ్గజం రాజమౌళి గురించి ఆయన విజయ పరంపర గురించి ఈరోజు ప్రపంచం మొత్తానికి తెలుసు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో స్టార్ట్ చేసి ఆర్ ఆర్ ఆర్ వరకు అతను తీసిన సినిమాలు 12. 12 సినిమాలు కూడా సూపర్ హిట్ అవడం ఒక రికార్డు. అదే కోవలో ఇప్పుడు టాలీవుడ్ లో మరొక దర్శకుడి పేరు వినిపిస్తుంది. రాజమౌళి తర్వాత అతనే అంత మోనగాడు అంటూ తెగ లేపేస్తున్నారు ఆదర్శకుడిని. ఇంతకీ ఆదర్శకుడు ఎవరంటే మన భగవంత్ కేసరి సినీ దర్శకుడు అనిల్ రావిపూడి.

ఈ దర్శకుడికి కూడా ఒక్క ఫ్లాప్ లేకుండా తీసిన ప్రతి సినిమాని హిట్ చేశాడు. రైటర్ గా కెరియర్ ని స్టార్ట్ చేసిన అనిల్ రావిపూడి కళ్యాణ్ రామ్ పటాస్ సినిమాతో దర్శకుడుగా పరిచయం అయ్యాడు. ఇప్పటివరకు ఈ దర్శకుడు ఏడు సినిమాలు తీశాడు. ఇందులో ప్రతి సినిమా సూపర్ హిట్. ఇప్పుడు అందరూ అనిల్ రావిపూడిని రాజమౌళితో కంపేర్ చేస్తున్నారు.

వాళ్ళిద్దరికీ ఉన్న కామన్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళిద్దరికీ ఉన్న కామన్ పాయింట్స్ ప్రతి ఒక్క సినిమాని హిట్ చేయడమే కాకుండా మరొక కామన్ పాయింట్ ఉంది అది ఏంటంటే. అనిల్ రావిపూడి గత మూడు సినిమాలు ఎఫ్2, ఎఫ్3, సరిలేరు నీకెవ్వరు సినిమాలో 100 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టాయి.

ఇప్పుడు భగవంత్ కేసరి కూడా 100 కోట్ల క్లబ్ ని ఎప్పుడో దాటిపోయింది ఇలా వరుసగా నాలుగు సార్లు 100 కోట్ల క్లబ్లో అడుగుపెట్టడం అనేది రాజమౌళికి సాధ్యమైంది. ఆ తర్వాత మళ్లీ ఆ ఘనత సాధించిన మగాడు అనిల్ రావిపూడి మాత్రమే అంటూ అనిల్ రావిపూడి ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు ప్రేక్షకులు. ఇప్పుడు అందరి దృష్టి అనిల్ రావిపూడి నెక్స్ట్ ప్రాజెక్ట్ పైనే ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -