Telangana: మునుగోడుతో పాటు తెలంగాణలో మరో ఉపఎన్నిక? ప్లాన్ చేస్తున్న బీజేపీ

తెలంగాణలో మరో ఉపఎన్నిక రానుందా? మునుగోడుతో పాటే ఈ ఎన్నిక కూడా జరుగుతుందా? బీజేపీ మరో ఉపఎన్నికకు ప్లాన్ చేసిందా? అంటే అవుననే సమధానాలు తెలంగాణ పాలిటిక్స్ లో జోరగా వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం మునుగోడు ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాలను హీటెక్కిస్తోంది. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నా.. ఈ ఉపఎన్నికను పార్టీలన్నీ సెమీ ఫైనల్ గా భావిస్తుండటంతో ఎన్నికల వేడి ఇప్పుడే మొదలైనట్లైంది. రాజగోపాల్ రెడ్డితో రాజీనామా చేయించి బీజేపీ ఈ ఉపఎన్నికకు కారణమైంది. అయతే త్వరలోనే మరిన్ని ఉపఎన్నికలు వస్తాయని, చాలామంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారనే బీజేపీ నేతలు పదే పదే చెబుతున్నారు. దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపుతో రాష్ట్రంలోకి బీజేపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి. దీంతో మరిన్ని ఉపఎన్నికల్లో గెలుపొంది రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో తమదే అధికారమనే సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ ప్లాన్ చేసింది.

అందులో భాగంగా హఠాత్తుగా రాజగోపాల్ రెడ్డితో రాజీనామా చేయించి ఉపఎన్నికకు తెరలేపింది. ఇక త్వరలో గోషామహల్ ఉపఎన్నికకు కూడా బీజేపీ ప్లాన్ చేసినట్లు ప్రచారం సాగుతోంది. అందుకే రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి అల్లర్లకు ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. ఆయనపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. ఆయనను అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని ఎంఐఎం నేతలు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి లేఖ అందజేశార. ఈ లేఖపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది సస్పెన్స్ గా మారింది.

రాజాసింగ్ అరెస్ట్ కావడంతో ఆయనకు బెయిల్ రాకపోతే కొద్దిరోజులు జైల్లో ఉండాల్సి ఉంటుంది. దీంతో రాజాసింగ్ తో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి మరో ఉపఎన్నికకు ప్లాన్ చేయాలనే ఆలోచన కాషాయదళం చేస్తున్నట్లు వార్తలు వస్తుననాయి. రాజాసింగ్ పై కమలం పార్టీ సస్పెన్షన్ వేటు మాత్రమే వేసింది. అంతేకానీ పార్టీ నుంచి బహిష్కరించలేదు. రాజాసింగ్ వివరణ ఇచ్చి క్షమాపణలు చెబితే సస్పెన్షన్ వేటు ఎత్తేసే అవకాశముంది. బీజేపీ సస్పెండ్ చేసినా సరే.. ఆ పార్టీ అంటే తనకు ఇష్టమని, మోదీ-అమిత్ షాలకు అనుచరుడిగానే ఉంటానని రాజాసింగ్ చెబుతున్నారు.

ఇక బీజేపీ నేతలు కూడా రాజాసింగ్ ను విమర్శించడం లేదు. ఆయనపై ఎలాంటి కామెంట్స్ చేయడం లేదు. దీనిని బట్టి చూస్తే రాజాసింగ్ వ్యవహారం బీజేపీనే నడిపిస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఈ కేసుల వల్ల రాజాసింగ్ రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళితే.. ఆయనకే ఎక్కువ విజయవకాశాలు ఉంటాయి. గోషామహల్ నియోజకవర్గంలో బీజేపీ బలంగా ఉంది. దీంతో అక్కడ ఉపఎన్నికలకు బీజేపీ ప్లాన్ చేస్తుందనే ప్రచారం ఊపందుకుంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -