CM KCR: తెలంగాణలో మరో ఉపఎన్నిక.. కేసీఆర్ సంచలన నిర్ణయం?

CM KCR: గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ బహిష్కృత నేత రాజాసింగ్ ప్రస్తుతం పీడీ యాక్ట్ కేసులో జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఆయనను విడుదల చేయాలంటూ ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ నేతలు పైకి ఆయన అరెస్ట్ మీద స్పందించకపోయినా.. లోలోపల మాత్రం ఆయనకు మద్దతుగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆయను మద్దతుగా బీజేపీ నేతలు తెరవెనుక న్యాయపరంగా సహాయం చేస్తోన్నట్లు తెలుస్తోంది. న్యాయవాదులతో రాజాసింగ్ కు బెయిల్ వచ్చేలా చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రాజాసింగ్ భార్య ఉషాబాయి సింగ్ తన భర్తకు బెయిల్ వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. న్యాయవాదులతో మాట్లాడుతున్నారు.

గవర్నర్ కు ఇప్పటికే ఉషాబాయి వినతిపత్రం అందించారు. అయితే ఈ క్రమంలో ఉషాబాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ పేరు చెప్పుకుంటూ కొంతమంది కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. సొంత రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది ఆయనును ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతోన్నాయి. రాజాసింగ్ పై కుట్రలు చేసే వారి పట్ల కార్యకర్తలు, ఆయన అభిమానులు జాగ్రత్తగా ఉండాలని సూచించాయి. ఈ మేరకు గురువారం ఆమె విడుదల చేసి ప్రకటన సంచలనం రేపుతోంది. హిందూ ధర్మం కోసం ప్రాణాలు ఇవ్వడానికి అయినా ఆయన సిద్దంగా ఉన్నారని ఆమె తన లేఖలో పేర్కొన్నారు. కాషాయ రక్తమే ఆయనతో ప్రవహిస్తున్నదని, దేశం కోసం, ధర్మం కోసం రాజాసింగ్ జైల్లో ఉన్నారని తెలిపారు.

హిందూ సమాజం, పార్టీ కార్యకర్తరలు, అభిమానులు అండగా నిలిస్తున్నందుకు ధన్యవాదాలు తతెలిపారు. తమ కుటుంబం అనాథ కాదని, అభిమానులు, బీజేపీ కార్యకర్తలంతా అండగా ఉన్నారని ఉషాబాయి తెలిపారు. ఇలాంటి పరిస్థితులలో హిందూత్వం పేరుతో కొంతమంది తమ రాజకీయ లబ్ధి కోసం కుట్రలు చేస్తున్నారని ఉషాబాయి వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. రాజాసింగ్ కు జైళ్లు, కేసులు కొత్త కాదని, ఆయన చేతిలో ఉండేది బీజేపీ జెండానే అంటూ తెలిపారు. హిందూత్వం పేరుతో ఆయనపై కొంతమంది చేస్తున్న కుట్రలను తిప్పికొడతాం అంటూ ఆమె తన లేఖలో పిలుపునిచ్చారు. అయితే ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనేది చర్చనీయాంశంగా మారింది. రాజాసింగ్ కుటుంబానికి పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఇచ్చిన ధైర్యానికి ధన్యవాాదాలు అని తెలిపారు.

అయితే పీడీ యాక్ట్ కేసులో నమోదన రాజాసింగ్ ప్రస్తుతం చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీంతో ఆయనను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కానీ రాజాసింగ్ అరెస్ట్ వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని పార్గీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో రాజాసింగ్ పై ఉన్న సస్పెన్షన్ ను ఎత్తివేయాలనే డిమాండ్లు బీజేపీ కార్యకర్తలు, అభిమానుల నుంచి వినిపిస్తున్నాయి. దీంతో ఆయనపై విధించిన సస్పెన్షన్ ను బీజేపీ ఎత్తివేస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఆయనపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలనే ఒత్తిడి బీజేపీ నేతలపై ఎక్కువగా వస్తోంది. సస్పెండ్ వేయడం వల్ల హిందూవుల్లో అసంతృప్తి నెలకొందని, మునుగోడులో పార్టీకి నష్టం జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది.

వచ్చే ఎన్నికల్లోగా ఆయన జైలు నుంచి బయటకు రాకపోతే ఆ స్థానం నుంచి ఇంకోకరు పోటీలోకి దిగేందుకు కసరత్తు చేస్తున్నారు. చాలామంది నేతలు టికెట్ ను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక మునుగోడు ఉపఎన్నికల తర్వాత రాజాసింగ్ పై అసెంబ్లీ స్పీకర్ వేటు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉపఎన్నిక వస్తే పోటీ చేసేందుకు చాలామంది సిద్దమవుతు్నారు. ఇలాంటి నేపథ్యంలో రాజాసింగ్ పై కుట్రలు చేస్తున్నారంటూ ఆయన భార్య భాషా సింగ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. అదే జరిగితే తెలంగాణ మరో ఉపఎన్నిక ఖాయంగా కనిపిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -