Teja Sajja: బన్నీ మూవీ కలెక్షన్ల రికార్డులను బ్రేక్ చేసిన తేజ సజ్జా.. పరువు పోయిందిగా!

Teja Sajja: మామూలుగా ప్రతి ఏడాది టాలీవుడ్ లో సంక్రాంతి పండుగ వస్తుంది అంటే చాలు సినిమాల జాతర మొదలవుతుంది. చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాలు వరకు ప్రతి ఒక్కటి కూడా సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తూ ఉంటారు మూవీ మేకర్స్. అలా ప్రతి ఏడాది కూడా సంక్రాంతి వద్ద చిన్న హీరోల నుంచి పెద్ద పెద్ద హీరోల వరకు పోటీ పడుతూ ఉంటారు. సంక్రాంతి సమయంలో యూత్ మాత్రమే కాక ఫ్యామిలీస్ కూడా సినిమాలు చూడడాన్ని ఎంతో ఇష్టపడతాయి. కుటుంబ సమేతంగా పెద్ద ఎత్తున ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. అందుకే ఆ సమయంలో మిగతా రోజుల్లో కంటే ఎక్కువ వసూళ్లు వస్తాయి. అందుకే సంక్రాంతికి వసూళ్ల పరంగా కొత్త రికార్డులు నమోదవుతుంటాయి.

 

అయితే ఎప్పటినుంచో సంక్రాంతి సినిమాల చరిత్రలో స్టార్ హీరోలు నటించిన పెద్ద సినిమాలదే ఆదిపత్యం కొనసాగుతూ వస్తోంది. వాటి పేరిటే రికార్డులన్నీ ఉంటాయి. కానీ ఈ ఏడాది హనుమాన్ అనే మిడ్ రేంజ్ మూవీ అన్ని రికార్డులనూ బద్దలు కొట్టేసి సంక్రాంతి హైయెస్ట్ గ్రాసర్‌గా నిలవడం విశేషం. ఈ విషయంలో సరికొత్త రికార్డును కూడా సృష్టించింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్ఞ హీరోగా నటించిన హనుమాన్ మూవీ ఈ సంక్రాంతికి విడుదలైన విషయం తెలిసిందే. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా పెద్ద సినిమాలను వెనక్కి నెట్టేసి మరి బ్లాక్ బస్టర్ హిట్ ను చేసుకుంది. అంతేకాకుండా రికార్డులో మోత మోగించింది. సంక్రాంతి బరిలో నిలిచి ఈసారి కొత్త రికార్డును సృష్టించింది హనుమాన్ సినిమా.

అన్ని అంచనాలను మించిపోయి ఏకంగా రూ.250 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. దీంతో మూడేళ్ల కిందట అల వైకుంఠపురములో సంక్రాంతి బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నెలకొల్పిన రికార్డు బద్దలైపోయింది. ఫుల్ రన్ అయ్యేసరికి ఏరియాల వారీగా కూడా హనుమాన్ అన్ని రికార్డులనూ తుడిచిపెట్టేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమా విడుదల అయ్యి ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఇంకా ఈ సినిమా మేనియా తగ్గడం లేదు. ఈ సినిమా మరిన్ని కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

RTO Padmavati: ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ అవుతున్న ఆర్డోవీ పద్మావతి.. వైసీపీ కోసం ఇంత చేస్తున్నారా?

RTO Padmavati:ఎన్టీఆర్ కృష్ణ జిల్లాలలో ప్రధాన పార్టీ అభ్యర్థుల నామినేషన్ పరిశీలన ప్రక్రియ తీవ్రస్థాయిలో ఉత్కంఠత నెలకొంది. ముఖ్యంగా గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కొడాలి నాని నామినేషన్ విషయంలో తీవ్రస్థాయిలో...
- Advertisement -
- Advertisement -