Prashanth Varma: ఆ విషయంలో ప్రశాంత్ వర్మ అదృష్టానికి తిరుగులేదుగా!

Prashanth Varma: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత సక్సెస్ వస్తే వారికి సినిమా అవకాశాలకు కొదువ ఉండదు. సిరిసంపదలకు కొదువ ఉండదు. ఒక్క హిట్ పడితే చాలు వారి జీవితమే మారిపోతుంది. అందుకే ఎంతోమంది దర్శకులు నటీనటులు ఒక మంచి హిట్ అందుకోవాలని భావిస్తూ ఉంటారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్వయం కృషితో ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అందుకున్న వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా ఒకరు.

 

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇటీవల హనుమాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం 40 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకేక్కినటువంటి ఈ సినిమా సుమారు 250 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈయనకు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కాకుండా బాలీవుడ్ అవకాశాలు కూడా వస్తున్నాయి.

ఇలా మనకంటూ ఒక సక్సెస్ వచ్చినప్పుడు బాగా ఆదాయం వచ్చినప్పుడు మనలో అణిగి ఉన్నటువంటి కోరికలు కూడా బయటపడటం సర్వసాధారణం. ఈ క్రమంలోనే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా అలాంటి కోరికలను తీర్చుకోవడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం బెంజ్ కారులో తిరుగుతున్నటువంటి ఈయన 6 కోట్ల విలువ చేసే కారును కొనుగోలు చేయబోతున్నారని తెలుస్తుంది.

 

ప్రశాంత్ వర్మ రేంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీలో హై ఎండ్ వెర్షన్ కారును బుక్ చేశారని ఈ కారు విలువ సుమారు 6 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది. ఇలా ఆరు కోట్ల రూపాయలు విలువచేసే కారు కొనుగోలు చేయడం అంటే ఈయన సక్సెస్ ఏ స్థాయిలో ఉందో మనకు స్పష్టంగా తెలుస్తోంది. హనుమన్ సినిమా హిట్ అనంతరం ఈయన రేంజ్ కూడా అదే స్థాయిలో పెరిగిపోయిందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ప్రశాంత్ వర్మ హనుమన్ సీక్వెల్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -