PM Modi: మోదీ కేబినెట్‌లో తెలంగాణ నుంచి మరొకరికి చోటు?

PM Modi: తెలంగాణలో ఎలాగైనా సరే కాషాయ జెండా ఎగుర వేయాలని బీజేపీ చూస్తోంది. దక్షిణదిలో కర్ణాటక తర్వాత తెలంగాణలో పాగా వేయాలని ప్రయత్నాలు సాగిస్తుంది. కేసీఆర్ పై వ్యతిరేకత పెరుగుతుండటం, ప్రతిపక్ష కాంగ్రెస్ బలహీనపడుతుండటంతో తెలంగాణలో గెలుపుకు అవకాశాలు ఉన్నాయని కమలదళం భావించింది. అందుకే తెలంగాణపై మోదీ, అమిత్ షా టార్గెట్ పెట్టారు. తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. మోదీ, అమిత్ షా డైరెక్టుగా రాష్ట్ర బీజేపీ నేతలతో టచ్ లో ఉంటూ ఎప్పటికప్పుడు పరిణామాలను తెలుసుకుంటున్నారు. గెలుపు వ్యూహలపై దిశానిర్దేశం చేస్తు్న్నారు.

బీజేపీనే టార్గెట్ గా సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం, దేశపర్యటన చేస్తూ ఎన్డీయేకు వ్యతిరేకంగా బీజేపీయేతర పక్షాల నేతలను కలుస్తుండటంతో మోదీ, అమిత్ షా అప్రమత్తమ్యారు. తెలంగాణపై గురిపెట్టి కేసీఆర్ ను ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో ఉన్నారు. అందుకోసం అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు సామాజికవర్గాల వారీగా ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్లాన్ లు రూపొందిస్తుంది. ఇందులో భాగంగా తెలంగాణలో ఎక్కువ జనాభా ఉన్న బీసీ ఓటర్లపై దృష్టి పెట్టింది. బీసీ ఓటర్లను ఆకట్టుకునేందుకు మోదీ, అమిత్ షా మదిలో ఓ ఆలోచన ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

అదే తెలంగాణకు కేంద్ర కేబినెట్ లో మరో స్థానం కల్పించడం. అది కూడా బీసీ సామాజికవర్గానికి చెందిన నేతకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం బీజేపీకి ఐదుగురు ఎంపీలు ఉ న్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి సోయం బాబు ఉన్నారు. ఇక లక్ష్మణ్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. వీరిలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఇప్పటికే కేబినెట్ పదవి కేటాయించింది. లక్ష్మణ్ కు ఎంపీ పదవితో పాటు పార్లమెంటరీ బోర్డు, ప్రచార కమిటీ బోర్డులో స్థానంక కల్పించారు.

ఇక తెలంగాణ నుంచి ఇప్పుడు కేంద్ర కేబినెట్ లో ఎవరికి చోటు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. బండి సంజయ్ లేదా ధర్మపురి అరవింద్ కు ఇచ్చే అవకాశముంది. ఎన్నికలకు రెండేళ్ల సమయం మాత్రమే ఉండటంతో ఎన్నికల టీమ్ ను రెడీ చేసుకునే ప్రయత్నాల్లో మోదీ ఉన్నారు. అందుకే ఎన్నికలకు ముందు కేబినెట్ పునర్ వ్యవస్ధీకరణ చేపట్టాలని భావిస్తున్నారు. ఇందులో ఎన్నికలు జరిగే రాష్ట్రాల నేతలకు ప్రాధాన్యత కల్పించనున్నారు. తెలంగాణలో మోదీ దృష్టి పెట్టారు కనుక రాష్ట్రం నుంచి మరోకరికి కేంద్రమంత్రి పదవి దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

బండి సంజయ్ కు ఇప్పటికే యువతలో బాగా క్రేజ్ ఉంది. రాష్ట్రంలో ఆయన అధ్యక్షుడు అయ్యాక బీజేపీ పుంజుకుంది. ఆయన ఆధ్వర్యంలో ఉపఎనికల్లో బీజేపీ విజయం సాధించింది. పాదయాత్ర ద్వారా ప్రజల్లో పేరు సంపాదించుకుంటున్నారు. కానీ బండికి కేంద్రమంత్రి పదవి ఇవ్వడం వల్ల రాష్ట్రంపై దృష్టి పెట్టే అవకాశం ఉండదని, కేంద్రమంత్రిగా పనిచేయడంతోనే సరిపోతుందని కమల వర్గాలు భావిస్తున్నారు. అందుకే బండి సంజయ్ కు ఇవ్వకపోవచ్చని అంటున్నారు. ధర్మపురి అర్వింద్ కు ఇచ్చే అవకావాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు.

బీజేపీలో ధర్మపురి అర్వింద్ పాపులర్ లీడర్ గా ఉన్నారు. యూత్ లో కూడా ఆయన క్రేజ్ సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంతో పాటు కేసీఆర్ పై పదునైన వ్యాఖ్యలతో విరుచుకుపడుతూ ఫైర్ బ్రాండ్ నేతగా గుర్తింపు పొందారు. కేసీఆర్ కూతురు కవితపైనే గెలిచారు. తన విమర్శలతో కేసీఆర్ ఫ్యామిలీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీకి నమ్మకస్తుడిగా ఉన్నారు. దీంతో ధర్మపురి అర్వింద్ కు కేంద్ర పదవి ఇచ్చే అవకాశముందని కమల వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -