Tollywood: టాలీవుడ్ లో మరో ప్రేమ జంట ఒకటి కాబోతుందా?

Tollywood: సినిమా పరిశ్రమలో ప్రేమ వివాహాలు అనేది చాలా కామన్. ఒకటి రెండు సినిమాలు కలిసి నటిస్తే చాలు వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అని కథలు అల్లేస్తారు జనం. సోషల్ మీడియా ప్రభావం పెద్దగా లేనప్పుడు కూడా ఇలాంటివి బాగానే నడిచాయి. ఇక సోషల్ మీడియా వచ్చిన తర్వాత అంతా తెరిచిన పుస్తకం అయిపోయింది. ఇందుస్త్రీలో ఏది జరిగినా ఇట్టే తెలిసిపోతుంది.

ఇక ప్రేమ వ్యవహారాల విషయాల పై అభిమానులకు మరియు మాములు సినిమా ప్రేక్షకులకు కూడా కొంచం ఉత్సాహం ఎక్కువగానే ఉంటుంది. అయితే వారిపై వచ్చినవన్నీ కొంత మంది గాసిప్స్ అని కొట్టిపారేయగా కొన్ని మాత్రం నిజమవుతాయి. అయితే కొందరు మాత్రం అసలు వాటిపై స్పందించరు. ఇవన్నీ పక్కన పెడితే టాలీవుడ్ లో మరో జంట ప్రేమ వివాహానికి రెడీ అవ్వబోతుందనే వార్త చక్కర్లు కొడుతుంది.

అయితే వీళ్ళిద్దరూ కలిసి కేవలం రెండు సినిమాలు మాత్రమే చేసారు. ఎన్ని సినిమాలైతే ఏంటి? ప్రేమకు అలాంటి వాటితో సంబంధం లేదు కదా. ప్రేమలో పడడానికి ఒక్క క్షణం చాలు. అలా రెండు సినిమాల వారి స్నేహం ప్రేమగా మారింది. ఇక ఎప్పటినుంచో వారు డేటింగ్ కూడా చేస్తున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అవే నిజం కాబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. ప్రేమ వ్యవహారం ముదరడంతో చేసేదేమీ లేక పెద్దలు కూడా ఓకే చేసినట్టు సమాచారం. ఇక ఈ సంవత్సరం నిశ్చితార్దం చేసుకుని వచ్చే సంవత్సరం పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నట్టుగా తెలుస్తోంది.

నిజం చెప్పాలంటే వీరిద్దరికీ గతంలో లవ్ స్టోరీలు ఉన్నాయి. ఆ హీరో గతంలో ఒక అమ్మాయిని ప్రేమించగా ఆ అమ్మాయితో బ్రేకప్ అయిపోయింది. హీరోయిన్ కి కూడా గతంలో ఒక లవ్ స్టోరీ ఉండగా దానికి కూడా ఫుల్ స్టాప్ పడింది. ఇలా ఒకరినొకరు బాగా అర్ధం చేసుకున్నారు కాబట్టే వారి అభిప్రాయాలు కూడా కలవడంతో ఒకటవ్వాలని డిసైడ్ అయిపోయారట.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -