Ravi Teja: రవితేజ సినిమాకు కృతిశెట్టి కూడా నో చెబుతుందా.. హతవిధీ మాస్ మహారాజ్ కు ఇలాంటి పరిస్థితా?

Ravi Teja: టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోని ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు వంటి వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు. ఇందులో టైగర్ నాగేశ్వరరావు సినిమా తాజాగా విడుదల అయ్యి ఊహించని విధంగా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా విడుదల అయ్యి కనీసం రెండు వారాలు కూడా పూర్తికాకముందే అప్పుడే రవితేజ తదుపరి సినిమాలకు సంబంధించి వార్తలు వినిపిస్తున్నాయి.

మాస్ మహారాజా నటిస్తున్న సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అవుతున్న కూడా దర్శకులు మాత్రం ఆయనకు వరుసగా అవకాశాలను ఇస్తూనే ఉన్నారు. తాజాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో రవితేజ-గోపీచంద్ మలినేని సినిమాకు సంబంధించిన వార్తలు, మహిళలవుతున్నాయి. అవేంటంటే.. రవితేజ, గోపీచంద్ మలినేని సినిమాకు హీరోయిన్ సమస్య వేధిస్తోంది. మొదట ఇందులో హీరోయిన్ గా రష్మీక ను తీసుకోవాలి అనుకున్నప్పటికీ ఆమెకు డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆమె కృతి శెట్టిని తీసుకోవాలనుకన్నారు. కానీ ప్రస్తుతం కృతి డేట్ లు కూడా అడ్జస్ట్ కావడం లేదు.

దాంతో ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటించనున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే రవితేజ సినిమాలకు హీరోయిన్ చెప్పడానికి గల కారణం ఆయన సినిమాలు ఫ్లాప్ అవ్వడమే అని తెలుస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకుడు కావడం, మైత్రీ సంస్థ బ్యానర్ కావడంతో సరైన హీరోయిన్ వుండాల్సిందే అనే పట్టుదలతో వున్నారు. కానీ హీరోయిన్ గురించి ప్రస్తుతం ప్రధాన సమస్యగా మారిపోయింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -