CM YS Jagan: జగన్ పై దాడి చేసిన వస్తువు కూడా దొరకలేదా.. సాక్ష్యాలు మాయమయ్యాయా? మాయం చేశారా?

CM YS Jagan: ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డి పై జరిగిన దాడి గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ విషయంపై అనేక రకాల అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ముఖ్యమంత్రి పై దాడి జరిగిన సమయంలో చుట్టూ వందలాది మంది నాయకులు, భద్రత సిబ్బంది, ఎమ్మెల్యేలు ఎంతోమంది ఉన్నారు. అయితే సీఎం పై దాడి జరిగినప్పుడు నాయకుల సంగతి పక్కన పెడితే భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి వారిని పట్టుకోవడం ఆ దాడి చేసిన వస్తువులు తీసుకోవడం లాంటివి చేయాలి.

అయినా జగన్ పై జరిగినట్లుగా చెబుతున్న దాడి తర్వాత ఒక్కటంటే ఒక్క ఆధారం సేకరించేందుకు పోలీసులు ప్రయత్నించలేదు. చివరికి రాయిని కూడా సేకరించలేదు. అసలు జగన్ పై దాడి జరిగిందా లేదా అన్నదానిపైనా అనేక సందేహాలు ఉన్నాయి. సాక్షి టీవీలో రాయి వస్తోందని మార్క్ చేసి చూపిస్తున్నారు కానీ మరే వీడియో దృశ్యాల్లోనూ రాయి కనిపించడం లేదు. స్కూల్ వైపు నుంచి వచ్చిందని సాక్షి మీడియా గట్టిగా చెబుతున్నప్పటికీ ఇతర ఏ వీడియోలో మాత్రం అది క్లారిటీగా కనిపించడం లేదు. క్యాడ్ బాల్ తో కొట్టారని కూడా వాళ్లే చెబుతున్నారు. ఒక సారి ఎయిర్ గన్ కూడా వాడారని ప్రచారం చేస్తున్నారు.

ఈ కథలన్నీ పోలీసులతో చెప్పిస్తారేమో కానీ కనీస సాక్ష్యం లేకపోతే నవ్వుల పాలవుతారు. ముందు ప్రధాన సాక్ష్యంగా రాయిని సేకరించాలి అలాంటి పని చేయలేదు. అసలు జగన్ పై రాయి దాడే జరగలేదన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అంతకు ముందు జగన్ కు ఒక గజ మాల వేశారు. ఆ గజ మాల చెందిన హుక్.. ఆయన మొహం మీద పడిందన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పుడే ఆయనకు గాయమయిందని చెబుతున్నారు. ఆ తర్వాత రాయి పడినట్లుగా యాక్షన్ చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అలా చెప్పుకోవడానికే సెక్యూరిటీ అందర్నీ కూర్చోబెట్టారని లైట్లు సహా.. అన్నీ ఆపేశారని భద్రతా వ్యవస్థ మొత్తం కళ్లు మూసుకుందన్న ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు హత్యాయత్నం కేసులు పెట్టి రాజకీయ కథలు చెప్పడానికి రెడీ అయ్యారు. ఇలా మొత్తంగా చూసుకుంటే ఇదంతా పక్కగా ప్లాన్ గా జరిగినట్టు అర్థం అవుతోంది.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -