YCP Butta Renuka: వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నవాళ్లు సైతం వైసీపీలో పేదలే.. ఇదే ప్రూఫ్ అంటూ?

YCP Butta Renuka: వైసీపీ అధినేత జగన్ దేశంలో ఆయన కంటే ఎవరూ పేదవాళ్లు లేరనట్టు మాట్లాడుతారు. ప్రజలకు నిజాలు తెలియదు అనుకుంటారో.. లేదంటే.. ఏం చెప్పినా జనం నమ్మేస్తారని అనుకుంటారో తెలియదు కానీ.. విచ్చల విడిగా బరితెగించి అబద్దాలు చెప్పేస్తారు. చంద్రబాబు నాయుడిలా నాకు పేపర్లు, న్యూస్ ఛానెళ్లు లేవని అంటారు. మరి సాక్షి ఛానెల్ ఎవరిదో ఆయనే చెప్పాలి. చంద్రబాబు నాయుడిలా వ్యాపారాలు లేవని అంటారు. మరి భారతీ సిమ్మెంట్ ఎవరిదో ఆయనే చెప్పాలి. తన అనుకునే వాళ్లు ఎవరూ లేరు. ప్రజలే తన వాళ్లని కాకా పడుతుంటారు. కానీ. తల్లి, చెల్లితో పాటు.. చిన్నాన్న ఫ్యామిలీ ఆయనకు ఎందుకు దూరం అయ్యారో ఆయనే చెప్పాలి. కారణాలు ఏమైనా అబద్దాలు ఆడటంలో మాత్రం జగన్‌కు వణుకు, బెణుకు ఉండదు. నిన్న మొన్నటి వరకూ ఆయన మాత్రమే పేదవాడు అని రాగాలు తీస్తూ వచ్చిన వైసీపీ అధినేత.. ఇప్పుడు తన అభ్యర్థులు కూడా పేదవాళ్లే అని చెబుతున్నారు. ఎన్నికల ప్రచారానికి వెళ్తూ అభ్యర్థులను ప్రజలకు పరిచయం చూస్తున్నారు. వారిని గెలిపించి అసెంబ్లీకో.. లేదంటే.. పార్లమెంటుకో పోటీ పంపిచాలని చెబుతున్నారు.

పార్టీ అధ్యక్షుడిగా అలా చెప్పడంలో తప్పులేదు. అక్కడితో ఆగకుండా తమ పార్టీ అభ్యర్థులు పేదవాళ్లని.. వారిని గెలిపించాలని కోరుతున్నారు. ఇక్కడే ప్రజల నుంచి పలు ప్రశ్నలు వైసీపీ నేతలకు ఎదురవుతున్నాయి. వైసీపీ అభ్యర్థులు పేదవాళ్లు కాబట్టి గెలిపించాలని జగన్ కోరుతున్నారు. అంటే వారు సంపాదించుకోవడం కోసం అసెంబ్లీ పంపించాలా? అన్న ప్రశ్న ఎదురవుతోంది. అయితే.. పేదవాళ్లు కానీ మంచివాళ్లు అని చెప్పుకోవడంలో కూడా తప్పు లేదు. కానీ, వైసీపీ అభ్యర్థులంతా పేదవాళ్లే అనేలా జగన్ ప్రచారం నడుస్తోంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బుట్టా రేణుకను గెలిపించాలని కోరారు. పనిలో పనిగా ఆమె ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని చెప్పారు. దీంతో.. టీడీపీ నేతలు ఆమెను, జగన్ ను ట్రోల్ చేస్తున్నారు.

ఎందుకంటే.. బుట్టారేణుకను పేద అభ్యర్థి అని అన్నారంటే.. మరి నిజంగా పేదవాళ్లను ఏమనాలని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. బుట్టా రేణుకకు హైదరాబాద్‌లో ప్రముఖ విద్యాసంస్థలు ఉన్నాయి. నగరం వ్యాప్తంగా చాలా బ్రాంచిలు ఉన్నాయి. అంతేకాదు.. హోండా టూ వీలర్ డీలర్ షిప్ ఉంది. దానికి తోడు ఆటోమొబైల్ ఇండస్ట్రీలు ఉన్నాయి. ఇన్ని ఉన్న బుట్టా రేణుక పేదవ్యక్తి ఎలా అవుతుందని టీడీపీ ప్రశ్నిస్తోంది. అలా అని ఈ వ్యాపారాలు అన్ని బుట్టారేణుకకు ఉన్నాయని టీడీపీ వాళ్లు క్లెయిమ్ చేయడం లేదు. గతంలో ఓ ఇంటర్వూలో ఆమె స్వయంగా చెప్పిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి ట్రోల్ చేస్తున్నారు. దేశంలోనే రిచెస్ట్ సీఎంగా ఉన్న జగన్ కు బుట్టారేణుక పేద వ్యక్తిగానే అనిపించవచ్చు. కానీ.. సామాన్యులు ఆమెను పేద వైసీపీ అభ్యర్థిగా చూడరని ట్రోల్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -