CM YS Jagan: జగన్ ను కచ్చితంగా దించాల్సిందే.. బాబు వ్యూహాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతోందా?

CM YS Jagan: ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఆ విషయంలో ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు. ఏ చిన్న రిస్క్ కూడా తీసుకోవడం లేదు. కలిసొచ్చేవారిని కలుపుకుపోతున్నారు. మొదట జనసేనతో పొత్తు కుదుర్చుకున్నారు. తర్వాత ఎన్డీఏ కూటమిలో చేరుతున్నారు. జనసేనతో పొత్తు చాలా ఈజీగానే జరిగిపోయింది. కానీ..ఎన్డీఏలో చేరిక అంత ఈసీగా జరగలేదు. ఓ సస్పెన్స్ థ్రిల్లర్‌లా సాగింది. 2014లో బీజేపీతో కలిసి పోటీ చేసిన చంద్రబాబు.. 2018లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరకంగా పెద్ద కూటమిని ఏర్పాటు చేశారు. బీజేపీ ఓటమి కోసం జాతీయ స్థాయిలో పోరాటం చేశారు. కానీ, కేంద్రం మరోసారి బీజేపీ రావడమే కాకుండా.. రాష్ట్రంలో టీడీపీ ఓడిపోయింది. రాష్ట్రంలో టీడీపీ ఈ ఐదేళ్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది. అధికార వైసీపీ.. టీడీపీ లీడర్లపై కేసులు పెట్టి వేధించింది. టీడీపీ క్యాడర్ ను భయాందోళనలకు గురి చేసింది. ఒకానొకదశలో టీడీపీ పని అయిపోందనే వాతావరణం కనిపించింది.

లోకల్ బాడీ ఎన్నికల్లో 80కి పైగా స్థానాలు వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. అందులోనూ మెజార్టీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో టీడీపీ క్యాడర్ వైరాగ్యంలోకి వెళ్లిపోయారు. అయితే, 2019 ఎన్నికలకు ముందు బీజేపీపై పోరాటం చేసిన చంద్రబాబు.. ఎన్నికలు అయినప్పటి నుంచి బీజేపీకి అనుకూల వైఖరినే తీసుకుంటూ వచ్చారు. పార్లమెంట్ లో బీజేపీకి సహకరిస్తూ వచ్చారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి తప్పు చేశానని బహిరంగంగానే పలు సార్లు చెబుతూ.. బీజేపీతో మరోసారి జత కట్టడానికి సిద్దమనే సంకేతాలు పంపించారు. కానీ, బీజేపీ నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. అయితే.. రెండేళ్ల క్రితం నుంచే పవన్ టీడీపీతో పొత్తుకు సిద్దమని చెబుతూ వచ్చారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత పవనే స్వయంగా పొత్తును ప్రకటించారు. కానీ.. బీజేపీతో టీడీపీ పొత్తు మాత్రం అంత త్వరగా తేలలేదు. బీజేపీ పెద్దలు ఎన్నికలకు దగ్గరలో ఏపీలో రాజకీయ పరిణామాలను బట్టి నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తూ వచ్చారు.

సుమారు ఐదేళ్లుగా పొత్తు కోసం నిరీక్షించిన చంద్రబాబు ఒకానొక దశలో బీజేపీపై నమ్మకాన్ని కూడా వదులుకున్నారు. అందుకే.. వన్ సైడ్ లవ్ స్టోరీ పనికిరాదని కామెంట్స్ చేశారు. ఇక ఎన్నికలు దగ్గర పడే కొద్ది ఈ పొత్తు వ్యవహారం ఉత్కంఠగా సాగింది. కానీ, చంద్రబాబు మాత్రం ఎలాగైనా 2014 ఫార్ములాతోనే ఎన్నికలకు వెళ్లాలని తీవ్రంగా ప్రయత్నించారు. చంద్రబాబు ప్రయత్నానికి పవన్ కూడా తోడైయ్యారు. పవన్ అప్పటికే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. మరోవైపు టీడీపీతో పొత్తు కూడా ప్రకటించారు. ఇప్పుడు టీడీపీని బీజేపీతో కలపాల్సిన అనివార్యత పవన్ కు ఏర్పడింది. లేదంటే ఏదో ఒక పార్టీతో దోస్తీ కట్ చేసుకోవాలి. మొత్తానికి పవన్ పట్టుదల, చంద్రబాబు నిరీక్షణ కలిసి ఏపీలో మరోసారి 2014 ఎన్నికల ఫార్ముల మరోసారి తెరపైకి వచ్చింది. ఈ ఎన్నికలు ఫెయిర్ గా జరిగితే చంద్రబాబుకు బీజేపీ అవసరం ఉండదు. టీడీపీ, జనసేన కలిసి ఉన్నాయి కనుక క్షేత్రం స్థాయిలో గెలుపు ఖాయంగా తెలుస్తోంది. కానీ.. వైపీపీ ఓటమి భయంతో అరాచకాలకు పాల్పడుతోందని చంద్రబాబు భయం. అందుకే బీజేపీతో పొత్తుకు పెట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు రిష్క్ తీసుకోదల్చుకోలేదు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఓడిపోతే టీడీపీ భవిష్యత్ ప్రమాదంలో పడుతుంది. 2029 నాటికి చంద్రబాబు పొలిటికల్ గా యాక్టివ్ ఉండకపోవచ్చు. లోకేష్ పూర్తి స్థాయి నేతగా ఎదగాలి అంటే.. ఇప్పుడు అధికారంలో ఉండాల్సిందే. లేదంటే.. ఇప్పుడు పొత్తులో ఉన్న జనసేన, బీజేపీయే టీడీపీ స్థానాన్ని ఆక్రమించవచ్చు. అందుకే చంద్రబాబు రిస్క్ తీసుకోకుండా ఎన్నికలకు సిద్దమయ్యారు. ఏపీలో రాజకీయ పరిస్థితులు కూడా వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నాయి. చంద్రబాబు వ్యూహాలు పని చేసేలాగే కనిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: జగన్ అధికారంలోకి వస్తే ఏపీ ప్రజల భూములు పోతాయా.. బాబు చెప్పిన విషయాలివే!

Chandrababu Naidu: జగన్ మరొకసారి అధికారంలోకి వస్తే ప్రజల భూములను అధికారికంగా కబ్జా చేస్తారని భయం ప్రజల్లో పట్టుకుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన భూ యాజమాన్య హక్కు చట్టం కబ్జాదారులకు అక్రమార్కులకు...
- Advertisement -
- Advertisement -