Pawan Kalyan: ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ పై కేసులు.. జనసేన విషయంలో వైసీపీ వణుకుతోందా?

Pawan Kalyan: సామ దాన భేద దండోపాయాలు ప్రయోగించి ఎన్నికల్లో గెలవాలని వైసీపీ చూస్తోంది. సామోపాయం ప్రకారం తమ ప్రభుత్వం ఏం చేసిందో వివరించి ఓట్లడిగేందుకు జగన్ ప్రయత్నించారు. నవరత్నాల ద్వారా ఒక్కొక్కరికి ఎంత లాభం చేకూర్చామో చెప్పే ప్రయత్నం చేశారు. కానీ, ఓ చేత్తో 10 రూపాయలు ఇచ్చి మరో చేత్తో 100 రూపాయలు తీసుకుంటున్నారని అర్థం చేసుకున్న ప్రజలు వైసీపీ ప్రచారాన్ని నమ్మలేదు. ఇక ఎన్నికల్లో ఎలాగూ దానోపాయం ప్రయోగిస్తారు. డబ్బు, చీరలు, మిక్సీలు, కుక్కర్లు లాంటివి ఇప్పటికే వైసీసీ నేతలు ఎన్నికల్లో పంచడానికి సిద్దమైయ్యారని తెలుస్తోంది. అది కూడా సరిపోదని భావించిన జగన్మోహన్ రెడ్డి టీడీపీ, జనసేన నాయకులపై భేదోపాయాన్ని ప్రయోగించారు. టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడకుండా చేయాల్సిందంతా చేశారు.

రెండు పార్టీల నేతలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కానీ చంద్రబాబు, పవన్ సంయమనం పాటించడం వలన ఆ రెండు పార్టీల నేతల ఓ మాట మీద పని చేస్తున్నారు. దీంతో.. దండోపాయాన్ని బలంగా ప్రయోగించడానికి జగన్ సిద్దమైనట్టు తెలుస్తోంది. మొదటి నుంచి వైసీపీ దండోపాయాన్ని ఆచరిస్తున్నారు. ఎదురు తిరిగిన వారిపై కేసులు, దాడులు చేస్తూనే ఉన్నారు. అయితే, ఎన్నికల సమయంలో మరింతగా దండోపాయాన్ని పెంచనున్నారు. ఇందులో భాగంగానే చంద్రబాబును జైలుకు పంపారు. ఎన్నికల వరకు ఆయన బయటకు రాకుండా చేయాలని ప్రయత్నించారు. కానీ, అది వర్క్ అవుట్ కాలేదు. ఇప్పుడు ఆయనపై ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ కేసులను తోడుతున్నారు.

దీంతో పాటు జనసేన అధినేత పవన్ పై కూడా కేసులు నమోదు చేస్తున్నారు. కొత్తగా పవన్ పై క్రిమినల్ కేసు నమోదైంది. గతంలో వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. ఈ కేసులు ద్వారా పవన్ ప్రచారానికి ఇబ్బందులు క్రియేట్ చేయాలని చూస్తున్నారు. వాలంటీర్లపై కామెంట్స్ అంశంలో కేసు నమోదైంది. అయితే, కోర్టు ఈ కేసు తిప్పి పంపినట్టు ప్రచారం జరిగింది. అయితే.. ఇప్పుడు ఆయనపై కేసు నమోదైందని.. మార్చి 25న కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్రంలో అమ్మాయిలు మిస్సి అవుతున్నారని.. వాలంటీర్లే అమ్మాయిలను అక్రమ రవాణా చేస్తున్నారని పవన్ వారాహి యాత్రలో సంచలన కామెంట్స్ చేశారు. పవన్ కామెంట్స్ లో నిజం ఉంది అన్నట్టు కేంద్రం కూడా ఏపీలో అమ్మాయిల మిస్సింగ్ కి సంబంధించి డేటా రిలీజ్ చేసింది. అయితే.. వైసీపీ ప్రభుత్వం పవన్ పై చర్యలు తీసుకోవాలని కోర్టుకు వెళ్లింది. కొందరు వాలంటీర్లతో కేసులు పెట్టించారు. అంటే.. వాలంటీర్లతోనే కేసులు పెట్టించి వారిని కొందరి నాయకులకే పరిమతం చేసే ప్రయత్నం చేశారు.

మిగిలిన పార్టీ నాయకుల దూరం చేసి వాలంటీర్లు అంతా వైసీపీని అట్టిపెట్టుకునే పరిస్థితులు క్రియేట్ చేశారు. దానికి తగ్గట్టుగానే వైసీపీ నేతలు కూడా వాలంటీర్లు అంతా మా వాళ్లే అని కూడా ప్రకటించుకుంటున్నారు. పలు ప్రాంతాల్లో వాలంటీర్ల అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. వాటిపై ప్రశ్నిస్తే కేసులతో వేధిస్తున్నారు. దాని గురించి విమర్శలు చేసిన పవన్ పై కూడా క్రిమినల్ కేసులు పెడతూ ఆయన్ని ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండేలా చేస్తున్నారు. అయితే.. ఎన్ని కుట్రలు చేసినా.. వైసీపీ ఓటమిని ఎవరూ ఆపలేరని జనసేన నేతలు చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -