AP Journalists: ఏపీ జర్నలిస్టులను సైతం నిలువనా ముంచేసిన జగన్.. మాటలకు చేతలకు ఇంత తేడానా?

AP Journalists: మాటతప్పం.. మడమ తిప్పం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ .. ఐదేళ్ల పాటు అద్భుత పాలన అందించామని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ అన్నట్టు.. జగన్ నొక్కుతున్న బటన్ల సంగతే చెబుతున్నారు తప్పా.. నొక్కాల్సిన బటన్ల గురించి మాట్లాడటం లేదు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగలను మోసం చేశారు. సీపీఎస్ రద్దు అని చెప్పి ఉద్యోగులను మోసం చేశారు. ప్రత్యేకహోదా అని చెప్పి యువతను మోసం చేశారు. అగ్రిగోల్డ్ స్కాం పేరు చెప్పి ఆ బాధితులకు కుచ్చుటోపీ పెట్టారు. ఇలా ఒకటి రెండు కాదు.. చెప్పుకుంటే చాలా పెద్ద లిస్టే ఉంటుంది. అయితే, చివరికి జర్నలిస్టులు కూడా జగన్ బాధితుల జాబితా నుంచి తప్పించుకోలేకపోయారు. ఐదేళ్లుగా జర్నలిస్టుల గురించి పట్టించుకోకుండా ఎన్నికలకు మూడు నెలల ముందు ఇదిగో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పెద్ద ఎత్తున్న ప్రచారం మొదలు పెట్టారు. ఎన్నికల ముందు తమకు ఇళ్ల స్థలాలు వచ్చేస్తాయని చాలా మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. జర్నలిస్టుల ఇళ్లకు సంబంధించి వారానికో అప్డేట్ వచ్చేంది. ప్రాసెస్ దగ్గర పడింది. ఇదిగో.. అదిగో అన్నారు. చివరికి ఇంత అన్నాడు.. అంత అన్నాడే గంగరాజు ముంతమామిడి పండన్నాడే గంగరాజు పరిస్థితి అయిపోయింది. ఎన్నికల కోడ్ రిలీజ్ కావడంతో… జర్నలిస్టుల ఇళ్ల దరఖాస్తులు చెత్త బుట్టలో పడిపోయాయి.

మాజీ మంత్రి పేర్నినాని నియోజవర్గానికి చెందిన ఫైల్ కలెక్టరేట్ లో కాకుండా చెత్తకుప్పలో బయటపడింది. ఈ విషయం జర్నలిస్టుల దృష్టికి చేరింది. దీంతో.. స్థానిక జర్నలిస్టులు అంతా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దగ్గర తమ గోడును చెప్పుకున్నారు. దీంతో.. ఆయన కలెక్టరేట్‌లో సమాచార శాఖ డీడీని కలిసి వివరణ కోరారు. అయితే.. కలెక్టరేట్‌ అధికారులు ఫైల్ చెత్తబుట్టలోకి వెళ్లిందని చెబితే బాగోదని.. ఫైల్ మిస్ అయిందని చెప్పి చేతులు దులుపుకున్నారు. దీంతో వారిపై మాజీ మంత్రి కొల్లురవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైల్ మిస్ అయిందని అంత నిర్లక్ష్యంగా ఎలా చెబుతారని నిలదీశారు. ఇంత బాధ్యతారాహిత్యంగా ఉంటే.. భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవని డీడీని హెచ్చరించారు. దీంతో.. కలెక్టర్ కలుగుజేసుకొని ఈ ఘటనపై విచారణ చేయిస్తమని హామీ ఇచ్చి పంపించారు.

అయితే, ఒక్క మచిలీపట్నంలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించిన ఫైల్లు ముందుకు కదలలేదు. కావాల్సిన వారికైనా స్థలాలు కేటాయిస్తారని అనుకున్నారు. నిజానికి ఇలా ఆశపడి దరఖాస్తు చేసుకున్న వారిలో బాకా ఊదే మీడియా సంస్థలు.. ఇండిపెండెంట్ జర్నలిస్టుల పేరుతో చెలామణి అయ్యే వారే ఎక్కువ. ప్రభుత్వ స్థలమే కదా జగన్ రాసిచ్చేస్తారని అనుకున్నారు. చివరికి కోడ్ రాగానే చెత్తబుట్టలో పడేశారు. స్థలాల పేరుతో జగన్ చూపించిన సినిమాకు వారికి మైండ్ బ్లాంక్ అయిపోయినట్లయింది.

జర్నలిస్టులకు ప్రోత్సహకాలు ఇవ్వడం సంగతి అటుంచితే.. రాష్ట్రంలో వారిపై దాడులు మాత్రం పీక్స్ కి చేరాయి. పత్రికలు, మీడియా చానళ్లు ప్రతిపక్ష పాత్రను పోషిస్తాయి. నిజానికి ప్రజాస్వామ్యంలో పత్రికలు ఉండటం చాలా గొప్ప విషయం. ఎందుకుంటే.. ప్రతిపక్షాలు నోరు తెరవలేని పరిస్థితుల్లో పత్రికలు ప్రభుత్వ వైఫల్యాలను చూపిస్తాయి. నిజానికి అది అధికార పార్టీలు ఓ వరంగా భావించారు. ఎక్కడైన ఓ సమస్య ఉందని న్యూస్ పేపర్లలో వస్తే.. ప్రభుత్వం దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయాలి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి రాష్ట్రంలోని అన్ని సమస్యలు తెలియాలని లేదు. ఆ సమస్యలు పత్రికల ద్వారా తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలి. పత్రికలను, మీడియాను ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా చూడాలి. రాజ్యాంగంలో కూడా ఇదే విషయం ఉంది. కానీ, ప్రస్తుతం పత్రికలకు ఆ గౌరవం దక్కడం లేదు. అంతేకాదు.. పత్రికలపై, విలేకరిలపై దాడులు కూడా జరుగుతున్నాయి. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దాడులు మరింతగా పెరిగాయి. ఈ ఎన్నికల వేళ పత్రికా సంస్థలపై, విలేకరిలపై దౌర్జన్యాలు పీక్స్‌కు చేరాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -