Ali-Posani: అలీ, పోసానికి ఏపీ ప్రభుత్వం కీలక పదవులు.. జగన్ మార్క్ పాలిటిక్స్

Ali-Posani: ఏపీలో వైసీపీ మళ్లీ రాజకీయంగా దూకుడు పెంచింది. సీఎం వైఎస్ జగన్ రానున్న ఎన్నికలపై దృష్టి పెట్టారు. నియోజకవర్గాల వారీగా నేతలతో సమీక్ష నిర్వహిస్తూ వచ్చే ఎన్నికల్లో గెలుపుపై దిశానిర్దేశం చేస్తున్నారు. నియోజకవర్గాల్లోని పరిస్ధితులపై నేతలకు సూచనలు చేస్తున్నారు. ఎలా ముందుుకు వెళ్లాలనే దానిపై నియోజకవర్గ నేతలకు రూట్ మ్యాప్ అందిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో 175కు 175 నియోజకవర్గాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న జగన్.. ఇప్పటినుంచే నేతలను ఎన్నికలకు సన్నద్దం చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ సర్వేల ద్వారా అంచనా వేసి సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేక ఉన్న చోట వేరే వారిని నియోజకవర్గ సమన్వయకర్తలుగా నియమిస్తున్నారు.

వైసీపీలో దాదాపు 30 మంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేక ఉన్నట్లు సర్వేల ద్వారా తెలిసింది. దీంతో ఆ 30 మంది స్ధానంలో కొత్త వారికి వచ్చే ఎన్నికల్లో సీటు కేటాయించనున్నారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టిన జగన్.. కొత్తచోట్ల అభ్యర్థుల ఎంపికపై కూడా శ్రేణులకు క్లారిటీ ఇచ్చారు. అభ్యర్ధిని కన్ఫార్ప్ చేస్తూ గెలిపించుకోవాలని సూచిస్తున్నారు. గెలిపించుకుంటే రెండోసారి ప్రభుత్వంలోకి వస్తే కీలక పదవులు ఇస్తానంటూ హామీలు ఇస్తున్నారు.

అయితే సినీ గ్లామర్ ను కూడా పెంచుకోవడంపై జగన్ ఫోకస్ పెట్టారు. గత ఎన్నికలకు ముందు వైసీపీకి సినీ గ్లామర్ బాగానే ఉంది. మంచు మోహన్ బాబుతో పాటు పృథ్వీరాజ్, అలీ, పోసాని కృష్ణమురళీతో పాటు పలువురు మద్దతు తెలిపారు. కానీ గత ఎన్నికల తర్వాత పృద్ధీరాజ్ కు పదవి ఇచ్చినా.. తర్వాత లైంగిక వేధింపుల ఆరోపణలతో అీతడిని పదవి నుంచి తొలగించారు. ఇక అలీకి రాజ్యసభ వదవి ఇస్తారనే ప్రచారం జరిగినా.. చివరి నిమషంలో ఆయనకు దక్కలేదు. ఇక పోసాని కృష్ణమురళికి ఎలాంటి పదవి ఇవ్వకపోవడంతో గత ఎన్నికల తర్వాత ఆయన వైసీపీకి దూరంగా ఉంటున్నారు.

ఇక ప్రస్తుతం రోజా తప్పితే వైసీపీకి సీని గ్లామర్ అంతగా లేదు. దీంతో మళ్లీ సినీ గ్లామర్ ను పెంచుకునేందుకు జగన్ కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా అలీ, పోసాని కృష్ణమురళిని మళ్లీ యాక్టివ్ చేయాలని భావిస్తున్నారు. దీంతో అలీ, పోసాని కృష్ణమురళిలు ప్రభుత్వంలో కీలక పదవులు ఇచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. అలీని ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమించనున్నట్లు వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గతంలో రాజ్యసభ పదవి అయినా లేదా వక్ఫ్ బోర్డు ఛైర్మన్ పదవి దక్కుతుందని అలీ భావించారు.

కానీ పదవులను ఆశించి అలీ భంగపడ్డారు. దీంతో ఈ సారైనా పదవులు దక్కుతాయనే ఆశ అలీలో ఉంది. పదవి దక్కకపోతే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి సపోర్ట్ చేసే అవకాశం ఉండదంటున్నారు. ఇక పోసాని కృష్ణమురళికి ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. అలీకి పదవి ఇచ్చి పోసానికి పదవి ఇవ్వకపోతే ఆయన అసంతృప్తికి గురయ్యే అవకాశముంది. అలీ కంటే ముందే నుంచి జగన్ కు పోసాని అండగా ఉన్నారు.

అందుకే అలీ, పోసానిలకు కీలక పదవులు ఇచ్చే ఆలోచనలో జగన్ ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫైల్ జగన్ టేబుల మీదకు వెళ్లిందని, రేపు, మాపో కీలక పదవులు దక్కే అవకాశముందనే ప్రచారం నడుస్తోంది. మరి చూడాలి అలీ, పోసానికి పదవులు దక్కుతాయో.. లేదే..

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -