Sharmila: షర్మిల అడిగిన ప్రశ్నలకు జగన్ దగ్గర సమాధానం ఉందా?

వైయస్సార్ వారసురాలిగా వైయస్ షర్మిల అందరికీ సుపరిచితమే అయితే గత ఎన్నికలలో ఈమె తన అన్న విజయానికి ఎంతో కారనమయ్యారు. కానీ ఇప్పుడు మాత్రం తన అన్న ఓటమికి కారణం అవుతున్నారు. వైస్ షర్మిల రాజశేఖర్ రెడ్డి బిడ్డగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని కాంగ్రెస్ పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్లో ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ అధికార నేత జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు కురిపిస్తున్నారు.

తాజాగా ఏపీ ప్రభుత్వం విడుదల చేసినటువంటి డీఎస్సీ గురించి ఈమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికల ముందు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం 6000 పోస్టులను విడుదల చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఇది మెగా డీఎస్సీ కాదని దగా డీఎస్సీ అని ఆమె తెలిపారు. ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలు చేసి వైకాపా నేతలకు సోషల్ మీడియాకు నేను సవాల్ విసిరుతున్నానని తాను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని ఈమె వైకాపా నేతలకు సవాల్ విసిరారు.

*2019 ఎన్నికల సమయంలో 25 వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ ఎక్కడా అని ప్రశ్నించారు.

*గడిచిన ఐదు సంవత్సరాలలో టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు.

*టెట్ డీఎస్సీ కలిపి నోటిఫికేషన్ ఇస్తే అభ్యర్థులు దేనికి ప్రిపేర్ అవ్వాలి?

*నోటిఫికేషన్ ఇచ్చిన 30 రోజులలో పరీక్ష నిర్వహించడం దేశంలో ఎక్కడైనా ఉందా?

* వైయస్ హయాంలో వంద రోజుల గడువు ఇచ్చిన మాట ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డికి తెలియదా?

*ఇచ్చిన సిలబస్ ప్రకారం ఒక్కో అభ్యర్థి 150 పుస్తకాలను చదవాలనీ మీకు తెలీదా?

* రోజుకు ఐదు పుస్తకాలు చదవడం సాధ్యమేనా?

*మానసిక ఒత్తిడికి కురిచేస్తూ అభ్యర్థులను పుట్టిన పెట్టుకోవాలని చూస్తున్నారు ఇది కుట్ర కాకపోతే మరేంటి అంటూ ఈమె ప్రశ్నించారు.

*ఎన్నికలకు నెలన్నర ముందు 6000 పోస్టులను విడుదల చేయడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు వైకాపా నేతలు దమ్ముంటే సమాధానాలు చెప్పాలని ఈమె సవాల్ విసిరారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -