AP Volunteers: మే 31వ తేదీ వాలంటీర్లకు చివరి వర్కింగ్ డేనా.. జగన్ మళ్లీ సీఎం అయితే అలా చేస్తారా?

AP Volunteers: ఎవరిని ఎలా వాడుకోవాలో వైసీపీ అధినేత జగన్‌కు తెలియదు. మనుషులను అయినా.. పరిస్థితులను అయినా రాజకీయంగా చాలా ఈజీగా వాడేస్తారు. అయితే, ఇక్కడి ట్విస్ట్ ఏంటీ అంటే.. వాడుకొని పని అయిపోయిన తర్వాత పక్కన పడేస్తారు. ఇది చాలా మంది విషయంలో చూశాం. బయట ఎవరినో పక్కన పెడితే.. జగన్ తన సొంత కుటుంబ సభ్యులనే వాడేసి పక్కకు నెట్టేశారు. మొదట తల్లి విజయమ్మను వైసీపీ గౌరవ అధ్యక్షరాలిగా పెట్టి.. ఆమె ఫోటోతో రాజశేఖర్ రెడ్డి లెగసీని వాడేశారు. తర్వాత ఇక పార్టీకి చేసిన సేవలు చాలని.. తెలంగాణలో చెల్లి దగ్గరకు వెళ్లిపోవాలని చెప్పారు. మరి చెల్లి తెలంగాణ ఎందుకు వెళ్లింది? కుమార్తె దగ్గరకు తల్లిని ఎందుకు పంపించారు? అనేది చూస్తే.. చెల్లిని తల్లికంటే బాగా పార్టీ కోసం వాడారు జగన్.

ఆయన జైల్లో ఉన్నపుడు షర్మిలతో పాదయాత్ర చేయించారు. ఆ పాదయాత్రతోనే వైసీపీ శ్రేణుల్లో ఆత్మ విశ్వాసం పెరిగింది. 2014లో వైసీపీ అధికారంలోకి వస్తుందనే అభిప్రాయం పార్టీలో, ప్రజల్లో పెరిగింది. కానీ.. జగన్ అతి విశ్వాసంతో ప్రతిపక్షానికే పరిమితం అయ్యారు. తర్వాత 2019 ఎన్నికలకు ముందు షర్మిలతో బస్సు యాత్ర చేయించారు. ఆమె యాత్ర వైసీపీకి మైలేజ్ పెంచి పార్టీ అధికారంలోకి రావడానికి ఓ కారణం అయింది. అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆమెకు ఎలాంటి పదవులు ఇవ్వకుండా ఆమెను పక్కన పెట్టారు. దీంతో.. ఆమె తెలంగాణలో రాజకీయం చేసుకోవడానికి వెళ్లిపోయారు. అలా ఆమెను వాడి పక్కన పడేశారు. గత ఎన్నికల ముందు వివేకాహత్య కేసును తనకు రాజకీయంగా వాడుకున్నారు. ఆతర్వాత ఆ కేసు పక్కన పెట్టేశారు. కేసులో నిందితులకు సపోర్టు చేస్తూ బాధితులను కూడా పక్కన పెట్టేశారు. ఇలా వాడిపడేయడంలో జగన్ తర్వాతే ఎవరైనా.

ఇక.. ఈ జాబితాలోకే వాలంటీర్లు కూడా వస్తారు. మీరే నా సైన్యం. మీరే వైసీపీ భవిష్యత్ నాయకులు అంటూ వాలంటీర్లు బిస్కెట్లు వేసి.. పార్టీకి కావాల్సిన పనులను జగన్ చేయించుకున్నారు. ప్రజలకు సర్వీస్ చేయడానికే అని చెబుతూ పార్టీ అవసరాల కోసం వాడేశారు. ఇప్పుడు వారికి కూడా ఎక్స్‌పేర్ డేట్ వచ్చినట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. వారికి లాస్ట్ వర్కింగ్ డే మే 31. మరోసారి అధికారంలోకి వస్తే తొలి సంతకం వాలంటీర్ల ఫైల్ పైనే పెడతానని ప్రచార సభల్లో జగన్ చెబుతున్నారు. ఇప్పటికే వాలంటీర్లు ఉన్నారు. మళ్లీ వాలంటీర్ల ఫైల్ పై తొలి సంతకం ఏంటీ అని ఆరా తీస్తే.. వాలంటీర్ల సర్వీసులకు సంబంధించిన ఒప్పందం మే ఆఖరు వరకే చేసుకున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత ప్రభుత్వం వారి సేవలను వినియోగించుకోదు. వారికి జీతాలు కూడా ఇవ్వదు. మళ్లీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్లను నియమించాలి. అందుకే ఫ్రెస్‌గా వాలంటీర్ల ఫైలుపై సంతకం అని అంటున్నారు.

ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. కొత్త ఫైలు ద్వారా కొత్తవారికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది. పాతవారిలో కొంతమంది మాత్రమే ఉంటారట. మిగిలిన వారంతా కొత్తవారే ఉంటారట. ఎందుకు అలా అంటే.. దేనికైనా ఓ ఎక్స్‌పేర్ డేట్ ఉంటుందని జగన్ తన సన్నిహితుల దగ్గర చెబుతున్నారట. పాతవారు గతంలో చేసినంత యాక్టివ్ గా పని చేయరని కూడా చెబుతున్నారట. మొత్తానికి వాలంటీర్ల ఉద్యోగం పేరుతో యువత జీవితాలతో జగన్ బాగానే ఆడుకున్నారు. వాలంటీర్లలో ఎక్కువ మంది 20 నుంచి 28 సంవత్సరాల మధ్యలోనే ఉన్నారు. అంటే జీవితంలో ఏదైనా సాధించే వయసు అది. ఆ వయస్సులో సాధించాలనే కసి కూడా యువతలో ఉంటుంది. ఆ దూకుడు తనాన్ని జగన్ తన పార్టీ కోసం వాడుకున్నారు. వాళ్లతో అసవరం తీరిన తర్వాత పక్కన పడేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -