Jagan: జగన్ పరువు పోవడానికి సలహాదారులే కారణమా.. ఏమైందంటే?

Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే తన పార్టీ నుంచి ఏ ఏ స్థానంలో ఏ అభ్యర్థులు పోటీ చేయాలి అనే విషయాలపై కసరత్తులు చేస్తున్నారు. ఏ పార్టీ నాయకుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్న అది పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తీసుకుంటారనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే 2024 ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ఈయన ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటిస్తున్నారు.

 

ఇలా అభ్యర్థుల ప్రకటన విషయంలో జగన్మోహన్ రెడ్డి సలహాదారుల మాటలు విని కాస్త తప్పుటడుగులు వేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే లేదా ఎంపీగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం కష్టపడుతూ ఉన్నటువంటి తరుణంలో ఈ ఎన్నికలలో ఆ అభ్యర్థులను తీసుకువెళ్లి మరో నియోజకవర్గంలో నిలబెడుతున్నారు.

ఇలా ఎమ్మెల్యేలను మార్చడం వల్ల కొత్త నియోజకవర్గంలో వారికంటూ ఏ విధమైనటువంటి గుర్తింపు ఉండదు. అలాంటి తరుణంలో ఎన్నికలలో గెలవడం కష్టతరం అవుతుందనే విషయం అందరికీ తెలిసిందే కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం కేవలం సలహాదారుల మాట విని ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు.

 

ఇకపోతే ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తరచూ తన నిర్ణయాలను మారుస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించిన వారిని చివరి నిమిషంలో వారి టికెట్లను రద్దు చేస్తూ అయోమయానికి గురవుతున్నారు. జగన్ ఇలా వ్యవహరించడానికి కారణం సలహాదారులేనని ఈ విధమైనటువంటి సలహాలు ఇవ్వటం వల్ల జగన్ పరువు గంగలో కలిసిపోతుందని పలువురు భావిస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -