Kiara Advani: హీరోయిన్ కియారా అద్వానీ పెళ్లికి రెడీ అయ్యిందా? పెళ్లికొడుకు అతడేనా?

Kiara Advani: తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కియారా అద్వానీ. తెలుగులో ఈ హీరోయిన్ కు మంచి పేరు ఉన్నా కానీ బాలీవుడ్ లో మాత్రం ఈమె ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఆ మధ్యన నగ్నంగా ఫోటో దిగి హాట్ టాపిక్ అయితే ఓ వెబ్ సిరీస్ లో వైబ్రేటర్ సీన్ తో వివాదానికి కేంద్ర బిందువైంది.

ఇవన్నీ పక్కన బెడితే ఈ అమ్మడు బాలీవుడ్ లో చాలా సినిమాలు చేసింది, ఇంకా ఎన్నో ప్రాజెక్టులు చేస్తోంది కూడా. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ.. ఎప్పుడూ ఇండస్ట్రీ టాక్ అవుతోంది. ఆన్ స్క్రీనే కాదు, ఆఫ్ స్క్రీన్ కూడా వీరిద్దరు లవర్స్ అంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి తోడు వీరిద్దరు కలిసి ఒకటే ఫ్లాట్ లో ఉండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది.

కియారా అద్వానీ పెళ్లి కోసం చూస్తోందని.. సిద్ధార్థ్ మల్హోత్రా కూడా రెడీ అయినట్లు తెలుస్తోంది. మొత్తానికి వీరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతోతున్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీ జనాల్లో చర్చకు దారితీసింది. ఢిల్లీలో వీరు అతి కొద్దిమంది సమక్షంలో పెళ్లి చేసుకోబోతున్నారని.. ఆ తర్వాత ముంబైలో గ్రాండ్ గా పార్టీ ఇస్తారనే ప్రచారం సాగుతోంది.

ఢిల్లీలో రిజిస్టర్ ఆఫీస్ లో వీరి పెళ్లికి సంబంధించిన పనులు కూడా చేసుకున్నారని తెలుస్తోంది. దీంతో వీరిద్దరు త్వరలోనే ఒక్కటి కాబోతున్నారని తెలుస్తుండగా.. ముంబైలో బాలీవుడ్ తో పాటు పలు ఇతర భాషలకు చెందిన సినీ ప్రముఖులను పిలిచి పార్టీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా కియారా తెలుగులో భరత్ అనే నేను సినిమాలో వసుమతిగా, వినయ విధేయ రామ సినిమాలో సీతగా మనల్ని అలరించడం తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -