Pre Release Events: అతి ప్రమోషన్స్ వల్లే సినిమాలు డిజాస్టర్ అవుతున్నాయా?

Pre Release Events: సాధారణంగా ఒక సినిమా తీస్తే దాన్ని ప్రేక్షకులలో ప్రమోట్ చేయడానికి ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహిస్తూ ఉంటారు. అంతేకాకుండా టైలర్, టీజర్ వంటివి విడుదల చేసి సినిమాని ప్రమోట్ చేసుకుంటారు. కానీ ఈ మధ్యకాలంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో కొందరు హీరోలు చేసే అతికి భారీ దెబ్బ తగిలింది. ఇటీవల విడుదలైన విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ఇందుకు మంచి ఉదాహరణ. లైగర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

అదేవిధంగా పలు ఇంటర్వ్యూలలో కూడా విజయ్ సినిమా గురించి పొగుడుతూ బిల్డప్ ఇచ్చాడు. లైగర్ ఒక సాలిడ్ సినిమా అని, ఈ సినిమాతో ఇండియా షేక్ అవుతుందని చాలా ఓవర్ కాన్ఫిడెంట్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ సినిమా కలెక్షన్స్ కు సంబంధించి తన లెక్క రూ. 200 కోట్ల నుంచి మొదలవుతుందని స్టేట్ మెంట్ ఇచ్చాడు. అయితే సినిమా విడుదలైన తర్వాత డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో విజయ్ ఈ సినిమాతో తన క్రెడిబిలిటీని బాగా దెబ్బతీసుకున్నాడని చెప్పొచ్చు.

అలాగే గతంలో రామ్ పోతినేని కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా గురించి చాలా బిల్డప్ ఇచ్చాడు. తన మాటలతో సినిమాకి మంచి ఓపెనింగ్స్ రాబట్టటానికి చాలా ప్రయత్నం చేశాడు. అసలు తనకి పోలీసు కథలంటేనే ఇష్టం లేదని, తన దగ్గరకు వచ్చిన పోలీసు కథలన్నీ రిజెక్ట్ చేశానని, కానీ దర్శకుడు ‘లింగు స్వామి’ మాత్రం దాన్ని ఒక పోలీస్ కథగా కాకుండా.. మామూలు కథగా చెప్పటంతో ఈ సినిమా కచ్చితంగా చేయాలని నిర్ణయించుకున్నా అంటూ ది వారియర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెగ గొప్పలు చెప్పాడు. కానీ ఆ సినిమాని కూడా లైగర్ లాగే ప్రేక్షకులు తిప్పి కొట్టారు.

ఇక మరొక టాలివుడ్ హీరో విశ్వక్‌సేన్ కూడా “పాగల్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇలాగే ఓవర్ చేశాడు. సినిమాకి మంచి ఓపెనింగ్స్ రాబట్టటానికి పాగల్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ .. ఈ సినిమా మామూలుగా ఉండదు ఈ సినిమా దెబ్బకు మూసుకున్న థియేటర్లు కూడా తెరచుకుంటాయని తెగ రెచ్చిపోయాడు. దీంతో సినిమా మీద ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకుని థియేటర్లకు వెళ్లారు.. కానీ సినిమా చూసిన తర్వాత వారి అంచనాలన్నీ తారుమారయ్యాయి. దీంతో ఈ మాత్రం సినిమాకి అంత బిల్డప్ అంటూ ప్రేక్షకులు రెచ్చిపోయారు. ఇదే మాటని విశ్వక్ సేన్ వద్ద ప్రస్తావిస్తే.. సినిమాకి ఓపెనింగ్ టికెట్స్ తెగాలి కదా అంటూ కవర్ చేశాడు. ఇలా మొత్తానికి ఈ హీరోలు ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ లో సినిమా గురించి గొప్పలు చెప్పటం ఎప్పుడు ఆపుతారో ఏమిటో..

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -