Prabhas: స్టార్ హీరో ప్రభాస్ అనారోగ్యం వెనుక అలాంటి రీజన్లు ఉన్నాయా?

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్నాడు. చిన్న హీరోగా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ప్రభాస్ మొదట్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని స్టార్ హీరోగా ఎదిగాడు. అలా బాహుబలి తరువాత ఈయన క్రేజ్ టాలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీలో కూడా పెరిగిపోయింది.

ఇక ఈయన అభిమానుల ఫాలోయింగ్ మాత్రం అంతా కాదని చెప్పాలి. ఈయన సినిమా గురించి ప్రకటిస్తే చాలు అప్పటి నుండి సినిమా విడుదల వరకు ఆయన అభిమానులు తెగ ఎదురు చూస్తూ ఉంటారు. బాహుబలి తర్వాత పలు సినిమాలు చేయగా ఆ సినిమాలు అంత సక్సెస్ కాలేకపోయాయి. అయినా కూడా ఆయనపై క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు.

 

ప్రస్తుతం ఆయన ఖాతాలో ఆది పురుష్, సలార్, స్పిరిట్, రాజా డీలక్స్ వంటి సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇవన్నీ షూటింగ్ బిజీలో ఉన్నాయి. కానీ ప్రభాస్ మాత్రం షూటింగ్లకు కొంతకాలం బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. గత కొన్ని రోజుల నుండి ప్రభాస్ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడని బాగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయన షూటింగ్లకు వెళ్లకుండా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటుందని తెలిసింది.

 

అయితే ఈయనకు ఇలా కావడానికి ఒక కారణం ఉందని తెలుస్తుంది. అదేంటంటే.. ప్రభాస్ ఒక చిన్న బడ్జెట్ సినిమా అయినా సాచి అనే సినిమా ప్రమోషన్స్ కి వస్తానని మాట ఇచ్చాడట. దాంతో ప్రభాస్ అభిమానుల కోరిక తీర్చడానికి ఎవరు రాకముందుకే ఉదయం ఐదు గంటలకి ప్రమోషన్ కోసం వచ్చి కూర్చున్నాడట. అయితే దీనివల్లనే ప్రభాస్ ఆరోగ్యం పాడయింది అని కొందరు అనుకుంటున్నారు. అంత ఉదయం వచ్చి కూర్చున్నందుకే ఆయన కాస్త డల్ అయ్యాడని ఆయన అభిమానులు అనుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -