Pawan Kalyan: ఈ సినిమాలు ఫ్లాప్ టాక్ తో కూడా కలెక్షన్ల విషయంలో అదరగొట్టాయా?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. టాలీవుడ్ లో ఈ పేరుకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు. ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి ఎంతటి ఫాలోయింగ్ ఉందో చెప్పటానికి ప్రత్యేక నిదర్శనం ఇటీవల పవన్ కళ్యాణ్ ఇంస్టాగ్రామ్ లో అకౌంట్ ఓపెన్ చేయగానే దాదాపు 6 గంటల్లోనే రెండు మిలియన్లకు పైగా ఫాలోవర్స్ పవన్ కళ్యాణ్ ని ఫాలో అవుతున్నారు.

 

ఇప్పటివరకు ఇంస్టాగ్రామ్ లో పవన్ కళ్యాణ్ ఒక్క పోస్ట్ షేర్ చేయకపోయినా కూడా ఇంతటి ఫాలోయింగ్ ఉందంటే అదే పవన్ కళ్యాణ్ పోస్ట్ షేర్ చేయడం ప్రారంభిస్తే ఆ ఫాలోయింగ్ ఎంతలా పెరుగుతుందో ఊహించుకోవచ్చు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు తన పార్టీ ప్రచారంలో బిజీ అయ్యాడు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించిన తర్వాత ఒకవైపు రాజకీయాల్లో ఒకవైపు సినిమాలను చాలా బ్యాలెన్స్ గా హ్యాండిల్ చేస్తున్నాడు.

ఇక ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడే ఎలక్షన్ హీట్ పెరగటంతో పవన్ కళ్యాణ్ కూడా ప్రచార కార్యక్రమాలతో బిజీ అయ్యాడు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ సైన్ చేసిన సినిమాలు అన్నింటిని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న బ్రో సినిమా తొందరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ కూడా కొన్ని డిజాస్టర్ సినిమాలు ఉన్నాయి. అయినప్పటికీ ఫ్యాన్స్ లో పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గటం లేదు.

 

పవన్ కళ్యాణ్ నటించిన రెండు సినిమాలు డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ కలెక్షన్ల విషయంలో మాత్రం అదరగొట్టాయి. కాటమరాయుడు, అజ్ఞాతవాసి సినిమాలు భారీ అంచనాలతో విడుదలై డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్నాయి. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ రెండు సినిమాలు రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించాయి. ఇదిలా ఉండగా ఈ నెలాఖరులో విడుదల కాబోతున్న బ్రో సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -