Raashi Khanna: రాశిఖన్నా కెరీర్ నాశనం కావడానికి ఈ సినిమాలే కారణమా?

Raashi Khanna: తెలుగు తెరకు హీరోయిన్ రాశీ ఖన్నా ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో పరిచయం అయ్యింది. అంతకుముందు ‘మనం’ సినిమాలో కనిపించింది. అయితే ఈమె చేతికి చాలా ఆఫర్స్ వచ్చినా అమె రిజెక్ట్ చేసిందట. అలా ఆమె చాలా సూపర్ హిట్ సినిమాలను మిస్ చేసుకుంది. రాశిఖన్నా మొదటిసారి 2013లో సూజిత్ సర్కార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మద్రాస్ కేఫ్’ సినిమాలో కనిపించింది. తెలుగులో ‘జిల్’, బెంగాల్ టైగర్’, సుప్రీమ్, తొలిప్రేమ, వెంకీ మామ, ప్రతీరోజూ పండగే’ వంటి సినిమాల్లో నటించింది.

ఈ సంవత్సరంలో రాశీ ఖన్నా హీరో గోపీచంద్ ‌తో ‘పక్కా కమర్షియల్’ సినిమాలో నటించింది. నాగ చైతన్య హీరోగా నటించిన ‘థాంక్యూ’ మూవీలో కూడా సందడి చేసింది. కార్తితో కూడా సర్ధార్‌లో కనిపించింది.

మారుతి డైరెక్షన్ లో హీరో శర్వానంద్ నటించిన ‘మహానుభావుడు’ సినిమాలో రాశీ ఖన్నాను అనుకున్నా ఆ తర్వాత ఆ అవకాశం మెహ్రీన్ కౌర్ కు లభించింది.

పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ‘గీత గోవిందం’ సినిమాలో కూడా ఈమెనే అనుకున్నారు. కానీ డేట్స్ కుదరకపోవడంతో రష్మిక మందన్నకు ఆ ఛాన్స్ వెళ్లిపోయింది.

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఎఫ్ 2 మూవీలో కూడా వరుణ్ తేజ్ కు జోడిగా రాశీ ఖన్నాను అనుకున్నారు. కానీ ఆ పాత్ర రాశీఖన్నాకు నచ్చకపోవడంతో రిజెక్ట్ చేసింది.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన ‘రాక్షసుడు’ సినిమాలో అనుపమ కంటే ముందు రాశీ ఖన్నాను అనుకున్నారు. కానీ అది కుదరలేదు.

నాగ చైతన్య, సమంత హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా ‘మజిలీ’లో రెండో హీరోయిన్ గా రాశీ ఖన్నాను అనుకున్నారు. కానీ ఆ పాత్ర దివ్యాంశ కౌశిక్ కు దక్కింది.

పరశురామ్ పెట్లా డైరెక్షన్ లో మహేష్ బాబు, కీర్తి సురేష్ హీరో, హీరోయిన్లుగా ‘సర్కారు వారి పాట’లో కూడా రాశీ ఖన్నాను అనుకున్నారు. కానీ ప్రొడ్యూసర్స్ కోరిక మేరకు కీర్తి సురేష్ ఫిక్స్ అయ్యింది.

నాని హీరోగా నటించిన మూవీ ‘టక్ జగదీష్’లో కూడా రాశీ ఖన్నా ఉండాలి. అయితే పాత్ర నచ్చకపోవడంతో ఆమె రిజెక్ట్ చేసిందట.

సిద్ధార్ధ్, శర్వానంద్ హీరోలుగా తెరకెక్కిన ‘మహా సముద్రం’ సినిమాలో కూడా రాశీ ఖన్నాను అనుకున్నారు. కానీ ఆమె ఎందుకో ఆ పాత్ర చేయనని చెప్పిందట.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -