RRR: ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ వచ్చిందని వాళ్లు బాధ పడుతున్నారా?

RRR: చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరినీ నాటు నాటు పాట ఉర్రూతలూగించింది. సినిమా రిలీజయ్యే సమయానికి ఈ పాట ఒక సంచలనంగా మారింది. అప్పటికే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’పై ఉన్న బజ్‌కు ఈ పాట తోడవడంతో సినిమాపై ఎక్కడలేని క్రేజ్‌ వచ్చింది. ఈ పాట కోసం ప్రత్యేకంగా థియేటర్‌లకు వెళ్లిన వాళ్లు ఎందరో ఉన్నారు. కీరవాణి సంగీతానికి గొంతు కలపని వారులేరు. రామ్‌చరణ్‌, తారక్‌ల స్టెప్స్‌కు కాలు కదపని ప్రేక్షకుడు లేడు.

హాలీవుడ్‌ ప్రేక్షకులను సైతం ఈలలు వేయించిన ఈ పాట సాహిత్యాన్ని పూర్తి చేయడానికి చంద్రబోస్‌కు దాదాపు 19నెలలు పట్టింది. ఒక పాట కోసం ఇంత సమయం తీసుకోవడం ఇదే తొలిసారని చంద్రబోస్‌ ఓ ఇంటర్వూలో తెలిపాడు. ఇక ఈ పాట కోసం ప్రేమ్‌ రక్షిత్‌ దాదాపు 95 స్టెప్పులు కంపోజ్‌ చేశాడు. తారక్‌, చరణ్‌లు భూజాలపై చేతులేసుకుని వేసిన హూక్‌ స్టెప్‌ కోసం ఏకంగా 30 వెర్షన్‌లు రెడీ చేశాడు. ఈ పాట కోసం రాజమౌళి 19 టేకులు తీసుకున్నాడు. కానీ చివరికి రెండో టేకునే ఓకే చేశాడు.

 

ఇలా ఒక్క పాట కోసం ఆర్‌ఆర్‌ఆర్‌ బృందం చిన్నపాటి యుద్దమే చేసింది. అంత కష్టపడ్డారు గనుకే ఈ పాటకు ఇప్పుడు ఇంటర్నేషనల్‌ లెవల్లో ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ పాటలో కేవలం తారక్‌, చరణ్‌ నాట్య ప్రతిభే కాదు, వాళ్లిద్ధరి మధ్య స్నేహబంధం ఎలాంటిదో తెలిపారు. తెల్లవాళ్ల ముందు తెలుగువాడి సత్తా ఏంటో చూపించారు.

 

వరల్డ్‌ వైడ్‌గా 81 పాటలు ఆస్కార్‌కు ఎంట్రీ ఇవ్వగా.. తుది జాబితాలో ఐదు పాటలు ఆస్కార్‌కు షార్ట్‌ లిస్ట్‌ అయ్యాయి. నాటు నాటు తో పాటు టెల్‌ ఇట్‌ లైక్‌ ఏ ఉమెన్‌ (అప్లాజ్‌), హోల్డ్‌ మై హ్యాండ్‌ (టాప్‌గన్‌:మావెరిక్‌), లిఫ్ట్‌ మీ అప్‌ (బ్లాక్‌ పాంథర్‌), దిస్‌ ఈజ్‌ లైఫ్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్ ఆల్‌ ఎట్‌ వన్స్‌) పాటలు ఆస్కార్‌కు పోటీ పడగా.. నాటు నాటు పాట ఆస్కార్‌ గెలిచి చరిత్ర సృష్టించింది. మరోవైపు తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళిని ద్వేషించే వాళ్ల సంఖ్య తక్కువేం కాదు. ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ రావడం వాళ్లకు నచ్చలేదని సమాచారం అందుతోంది. దీనిపై సినీ ప్రియులు సైతం మండిపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -