Tomato Prices: మదనపల్లె మార్కెట్ లో టమోటా ధరలు ఇంత ఘోరమా.. కిలో కేవలం ఎంతంటే?

Tomato Prices: ఈమధ్య మార్కెట్లో టమోటా రేట్లు ఆకాశాన్ని అంటుతున్న విషయం అందరికీ తెలిసిందే. గతంలో ఎన్నడూ లేనంత రీతిలో టమాట ధరలు ఉన్నాయి. ఒక ప్రదేశం అని కాకుండా దేశవ్యాప్తంగా టమాటా రేట్లు అత్యధికంగా పెరిగాయి. అయితే టమోటా మార్కెట్ కు ఫేమస్ అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి మార్కెట్లో ఈ నెల జులై 30న కేజీ టమోటా చరిత్రలో అత్యధికమైన రేటుతో 196 రూపాయలు పలికింది.

చాలామంది టమోటాలు వాడడమే మానేశారు. అతి అవసరానికి తప్ప టమోటాలను వాడడం లేదు. హోటల్లో కూడా టమోటాలను వాడకమే తగ్గించేశారు. వీటి గురించి టీవీలో కూడా చాలా చర్చలు జరిగాయి. సోషల్ మీడియాలో కూడా ఇది హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు రైతులు ఎంతో ఆనందిస్తున్నారు. వాళ్లకి ఇప్పుడిప్పుడే లాభాలు రావడం మొదలయ్యాయి.

కానీ ప్రజలు చాలా మంది ఎంతో ఇబ్బంది పడుతున్నారు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మొన్న మొన్నటి నుంచి టమోటా ధరలు కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తున్నాయి. గత నాలుగు రోజుల నుంచి మార్కెట్లోకి టమాటాలు ఎక్కువ సంఖ్యతో రావడం వల్ల రేట్లు కొంచెం కొంచెంగా తగ్గుతున్నాయి. బుధవారం రోజున మదనపల్లె మార్కెట్ లో టమోటా కిలో రూ.80 నుంచి రూ.100 వరకు పలికింది.

ఇక నిన్నటితో పోలిస్తే ఈ రోజు మరింత ధరలు దిగొచ్చాయి. గ్రేడ్ ‘ఏ’ టమోటాలు కిలో రూ. 50 నుంచి రూ. 64 వరకు పలికింది. గ్రేడ్ ‘బి’ రూ. 36 నుంచి రూ. 48 వరకు పలికింది. సగటున కిలోకు రూ. 44 నుంచి రూ.60 మధ్య రైతుల నుంచి వ్యాపారులు టమోటాలు కొనుగోలు చేసినట్లు మార్కెట్ యార్డ్ కార్యదర్శి తెలిపారు. మదనపల్లి లో ఈరోజు చోటు చేసుకున్న సందర్భం అన్ని మార్కెట్లోని చోటు చేసుకుంటుంది అనే ఆశాభావం అందరిలో కనిపిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -