Tomato: కిలో టమోటా కేవలం పది రూపాయలు.. ఏపీలో రైతుల పరిస్థితి ఇంత ఘోరమా?

Tomato: గత రెండు నెలలుగా టమాటాలు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మార్కెట్లో టమాటాలకు విలువ అధికంగా పెరిగింది. ప్రజలు టమాటాలు జోలికి వెళ్లడమే మానేశారు. ఊహించని విధంగా టమాటా ధరలు పెరగడం వల్ల కొనుగోలుదారులు కూడా అత్యవసరమైన పరిస్థితుల్లో కాకుండా సాధారణంగా టమాటాలను కొనడం తగ్గించారు. టమాటా రేట్లు కేజీ 200 వరకు కూడా పెరిగిన రోజులు ఉన్నాయి. ఆ సమయంలో చాలామంది రైతులు కోటీశ్వరులుగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి.

 

ఇది కొన్ని మందికి లాభంగాను మరికొన్ని మందికి నష్టం గాను మారింది. ఈ రేట్లకి ప్రజలు ఇబ్బంది పడినా కూడా చాలామంది రైతులు లాభాలును పొందారు. అయితే క్రమక్రమంగా వాటి ధరలు తగ్గుతూ వచ్చాయి. అవి ఇంకా తగ్గి కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో కేజీ టమాట పది రూపాయలు లేదా అంతకన్నా తక్కువకి పలికాయి. రేట్లు మరీ ఇంత కింద స్థాయికి దిగజారి పోవడం వల్ల రైతులు చాలా బాధపడుతున్నారు. ప్రభుత్వం వీళ్ళకి అన్యాయం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని అడుగుతున్నారు.

రైతులకి గిట్టుబాటు ధరలు ఉండేలాగా కోరుతున్నారు.మరోవైపు ధరలు తగ్గుతున్నా కొనుగోలుదారులు సంతోషంగా లేరు. రైతుల నుంచి కిలో రూ.10 చొప్పున టమాటాలు కొంటున్న వ్యాపారులు మార్కెట్ లో మాత్రం 40, 50 రూపాయలకు అమ్ముతున్నారు. అటు రైతులు, ఇటు కొనుగోలుదారులు తీవ్రస్థాయిలో నష్టపోతున్నారు. రైతులకు, కొనుగోలుదారులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

 

టమాటా ధరలు తగ్గుతున్న విషయంలో ఆందోళన చెందుతున్నారు.ధరలు మరీ ఈ స్థాయిలో తగ్గుతాయని ఊహించలేదని వాళ్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.టమాటా ధరలు తగ్గడంతో ఇతర కూరగాయల ధరలు సైతం అమాంతం తగ్గుతున్నాయి. వీటి వల్ల మార్కెట్లో రైతులకు చాలా నష్టం జరుగుతుంది ఈ విషయం గురించి ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అని రైతులు తమ బాధని వ్యక్తం చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -