Tomato: కిలో టమోటా 30 పైసలు.. టమోటా రైతుల కన్నీటి కష్టాలు వింటే షాకవ్వాల్సిందే!

Tomato: మొన్నటి వరకు సోషల్ మీడియాలో పాటు దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా టమోటా పేరు మార్మోగిన విషయం తెలిసిందే. కిలో టమాట ధర 300 రూపాయల ధర పలకడంతో సామాన్యులు టమోటాలు కొనుగోలు చేయాలి అంటేనే భయపడిపోయారు. అయితే అది మొన్నటి వరకు మాత్రమే. ఎందుకంటే టమాటా మళ్లీ యధాస్థితికి చేరుకుంది. ఎందుకంటే మొన్నటి వరకు కిలో టమాట 300 రూపాయలు ప్రస్తుతం మార్కెట్లో టమాటా కిలో కేవలం 30 పైసలు పలుకుతోంది. వినడానికి షాకింగ్ గా ఉన్న ఇది నిజం.

కిలో టమాట కనీసం 30 రూపాయలు కూడా కాదు దారుణంగా 30 పైసలు పలుకుతోంది అంటే రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో కిలో టమాట ధర 30 పైసలు పలుకుతోంది. టన్నుల కొద్దీ టమాట డబ్బాలు అమ్మినా కూడా రవాణా ఖర్చులు కూడా రావు. దీంతో చేసేదేం లేక రోడ్డు పక్కన టమాటాల్ని పడేస్తున్నారు రైతులు. మొన్నటివరకు అమృతంగా కనిపించిన టమాట, ఇప్పుడు వృధాగా పడి ఉంది.

పశువులకు మేతగా మారింది. మొన్నటి వరకు టమోటా మండిపోవడంతో టమోటాల కోసం రైతులను చంపడం, దొంగతనాలు చేయడం లాంటివి చేసారు. కొంతమంది అయితే టమోటా దారులు పెరిగిపోవడంతో సోషల్ మీడియాలో రకరకాల రీల్స్ చేసి మరి పెట్టారు. కానీ ప్రస్తుతం టమాటాలు ఎప్పటిలాగే రోడ్డుపైన కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. కనీస దిగుబడి రాక రైతులు గుండెలు విలసేలా రోదిస్తున్నారు. టమాటా పంటకు ప్రసిద్ధిగాంచిన చిత్తూరు జిల్లా మదనపల్లెలో కూడా టమాట ధర దారుణంగా పడిపోయింది. కిలో టమాట 3 రూపాయలు పలుకుతోంది.

హైదరాబాద్ లో కిలో టమాట ధర 25 రూపాయల నుంచి 30 రూపాయల మధ్య నడుస్తోంది. దీంతో టమోటా రైతులు గుండెలు బాదుకోవడంతో పాటు మార్కెట్లోకి తీసుకెళ్ళలేక రోడ్డు వైపున కుప్పలు కుప్పలుగా పారేస్తున్నారు. ఈ విషయంపై కొందరు స్పందిస్తూ మొన్నటి వరకు టమోటా ధరలు పెరిగిపోవడంతో రీల్స్ చేశారు కదా మరి ఇప్పుడు రోడ్డుపై ఊతగా ఉన్న టమోటాలను చూసి ఎవరు రీల్స్ చేయరే అంటూ ప్రశ్నిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -