Tomato: టమోటా రేటు ఇంత చీపా.. మదనపల్లె మార్కెట్ రేటు తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే!

Tomato: గత వారం రోజుల క్రిందట వరకు టమోటా అంటేనే మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు వామ్మో అనేవారు. అంతగా టమోటా ధరలు ఆకాశానికి తాకాయి. టమోటాలు కొనే బదులు చికెన్ కొనడమే నయం అనిపించేలా టమోటా ధరలు ఆకాశానికి చేరాయి. కిలో పది రూపాయలకు దొరికే టమోటా పండ్లు ఏకంగా 200 రూపాయలకు చేరడంతో మధ్యతరగతి ప్రజలు వంటలలో టమోటాలు వేయడం కూడా మర్చిపోయారు.

ఇంతలా టమోటాలకు మార్కెట్లో డిమాండ్ పెరిగింది. ఇక టమోటా పెట్టినటువంటి రైతులు కోటీశ్వరులుగా కూడా మారిపోయారు. ఇన్ని రోజులు టమోటాలతో నష్టాలు ఎదుర్కొన్నటువంటి కొంతమంది రైతులు కోటీశ్వరులుగా మారిపోయారు. అయితే ప్రస్తుతం పంట దిగుబడి అధికంగా ఉండటంతో టమోటా ధరలు నేలచూపులు చూస్తున్నాయి. గత వారం రోజులుగా టమోటా ధరలు తగ్గుముఖం పట్టడంతో సామాన్యులు ఊపిరిపించుకున్నారు.

 

ప్రస్తుతం కిలో టమోటాలో 30 నుంచి 40 మధ్యలో ధర పలుకుతుండడంతో సామాన్యులకు కాస్త ఉపశమనం కలిగింది. ట‌మోటా మార్కెట్‌కు ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని మ‌ద‌న‌ప‌ల్లె ప్ర‌సిద్ధి. ఆ మార్కెట్‌లో ప్ర‌స్తుతం ట‌మోటా కిలో రూ.33కు అమ్ముతున్నారు. గ‌తంలో ఎప్పుడూ ఈ స్థాయిలో ట‌మోటా ధ‌ర‌లు లేవు. ఇలా ఒక్కసారిగా టమోటా ధరలు పడిపోవడంతో ప్రస్తుతం టమోటో పెట్టినటువంటి రైతుల పరిస్థితి యధా విధిగానే మారిపోయింది. పంట దిగుబడి పెరగడంతో ధరలు కూడా తగ్గు ముఖం పట్టాయి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -