Akira: ఫస్ట్ మూవీకి అకీరాకు అన్ని రూ.కోట్లు ఇస్తున్నారా?

Akira: టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి, ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అటు రాజకీయాల్లోనూ, ఇటు సినిమాల్లోనూ పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నాడు. ఇకపోతే పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ గురించి అడపాదడపా వార్తలు మాత్రమే వస్తుంటాయి. 18 ఏళ్ల అకిరా నందన్ తన తల్లి రేణు దేశాయ్ దగ్గరే ఉంటున్నాడు. పవన్, రేణు దేశాయ్ విడాకులు తీసుకున్నాక అప్పుడప్పుడూ అకీరా తన తండ్రి వద్దకు వస్తూ ఉంటాడు.

మెగా కుటుంబంలో ఏదైనా పెద్ద కార్యక్రమాలు జరిగితే అకీరా హాజరవుతుంటాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వారసుడిగా అకీరా సినిమాను చూడాలని పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రేణు దేశాయ్ సైతం అకిరా నందన్ ని సినిమాల్లోకి తీసుకురావడానికి పలు ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. తండ్రికి తగ్గ కొడుకైన అకీరా చాలా సైలెంట్ గా ఉంటాడు. తాజాగా అకీరా తన తండ్రి సినిమా అయిన ఖుషీని థియేటర్లో చూసి తెగ ఎంజాయ్ చేశాడు.

త్వరలోనే అకీరా సినిమాల్లోకి రానున్నాడని, ప్రస్తుతం కథను కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అకీరా సినిమా భారీ స్థాయిలో ఉండనుంది. మెగా ఫ్యామిలీలో అకీరాకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. సినిమాలు తీయకుండానే అకీరాకు అంత క్రేజ్ ఉంటే ఇక సినిమాలు తీస్తే తండ్రికి మించిన క్రేజ్ ను సొంతం చేసుకోగలడు.

అందుకే అకీరా సినిమాను వీలైనంత త్వరగా థియేటర్లకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా అకీరా సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకోనున్నాడోననే ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అకీరా తన సినిమాకు గాను రూ.50 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లు సమాాచారం. ఇదే నిజమైతే పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. త్వరలోనే అకీరా సినిమా గురించి పూర్తి సమాచారం తెలియనుంది.

 

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -