Prabhas: ప్రభాస్ ను తొక్కేసే దిశగా అడుగులు పడుతున్నాయా.. ఏమైందంటే?

Prabhas: బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు డార్లింగ్ ప్రభాస్. తన రేంజ్ కూడా ఈ మూవీతో అమాంతం పెరిగిపోయింది. అంతేకాదు మాకాం కూడా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు మార్చాడు. అక్కడే సొంత ఇళ్లు తీసుకొని ఉండిపోయాడు. కేవలం పాన్ ఇండియా, పాన్ వరల్డ్ మూవీలు మాత్రమే చేస్తున్నాడు ప్రభాస్. అయితే ప్రభాస్ ను బాలీవుడ్ ఇండస్ట్రీ తొక్కేస్తోందని ఆరోపణలు వస్తూనే ఉన్నాయి.

 

ఆరడుగుల అందగాడు ప్రభాస్. బాహుబలి నుంచి అంతర్జాతీయ స్టార్ అయిపోయాడు. టాలీవుడ్ సత్తా ఏంటో ప్రపంచానికి చూపించాడు.ఇదే క్రమంలో బాలీవుడ్ వర్గాలకు కుళ్లు వచ్చిందని తెలిసింది. తమ సినిమాలను తొక్కేస్తూ తెలుగు సినిమా ఈ స్థాయిలో ఆడటం ఏంటి, పైగా హీరోకు ఇంత క్రేజ్ రావటం ఏంటని ప్రశ్నించుకున్నట్లు సమాచారం. ఈ తరుణంలో ఆయన్ను ఎలాగైనా తొక్కేలాని పన్నాగం పన్నినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలోనే సాహో, ఆదిపురుష్ సహా పలు సినిమాలను పెద్ద మెుత్తానికి ప్రభాస్ కు ఆఫర్ చేశారట.

ప్రభాస్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకే బాలీవుడ్ వర్గాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని అంటున్నారు. సాహోలో కొన్ని సీన్లు అలానే ఉన్నాయన్నారు. అంతేకాదు, బాయికాట్ బాలీవుడ్ నుంచి బయట పడేందుకు దీన్ని ఉపయోగించుకుంటున్నారని సమాచారం. ఏది ఏమైనా ప్రభాస్ ను తొక్కేస్తున్నట్లు వస్తున్న వార్తలను కొట్టిపారేయలేం. అయితే ఇంత పెద్ద హీరో అయిన ప్రభాస్ కు ఆ మాత్రం తెలియదా అంటున్న వాళ్లు ఉన్నారు. ఇలా కావాలనే తన ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తే ఊరికే ఉంటారా అని కూడా అంటున్నారు. ఏది ఏమైనా ప్రభాస్ మాత్రమే ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాలి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan , YS Sharmila: పసుపు రంగును జగన్ సహించలేకపోతున్నారా.. నీచమైన కామెంట్ల వెనుక కారణాలివేనా?

CM Jagan , YS Sharmila: వైయస్ జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి అంటే ఆయన మాట తీరు ఆయన వ్యవహార శైలి ఎలా...
- Advertisement -
- Advertisement -