Shaakuntalam: శాకుంతలం ట్రైలర్ విషయంలో బన్నీ ఫ్యాన్స్ హ్యాపీగా లేరా?

Shaakuntalam: టాలీవుడ్ లో డైరెక్టర్ గుణశేఖర్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఆయన తీసే సినిమాలు వైవిధ్యభరితంగా ఉంటాయి. జనాలకు ఆయన సినిమాలు బాగా కనెక్ట్ అవుతాయి. అయితే ఈ మధ్య ఆయన సినిమాలు అంతగా మింగుడుపడటం లేదని తెలుస్తోంది. రాణిరుద్రమదేవి సినిమా అనుష్కతో చేసి చేతులు కాల్చుకున్నారు. కానీ ఎఫెక్ట్స్, సెట్టింగ్ వర్కులకు మంచి మార్కులే పడ్డాయి. ఇకపోతే ఇప్పుడు శాకుంతలం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

 

శాకుంతలం సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత నటిస్తోంది. గత కొన్ని రోజులుగా సమంత వార్తల్లో నిలుస్తూ వస్తోంది. అక్కినేని హీరో నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత సోషల్ మీడియాకు కాస్త దూరం అయ్యింది. యశోద సినిమాతో ఆమె మంచి సక్సెస్ ను అందుకుంది. ఆ సినిమా టైంలో ఆమె మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది. ఈమధ్యనే ఆమె ముంబై ఎయిర్ పోర్టులో కనిపించింది. బక్కపల్చగా ఆమె మారడంతో నెటిజన్లు బాధగా కామెంట్స్ చేస్తున్నారు.

 

ఇదిలా ఉండగా శాకుంతలం సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ చూసినవారంతా విభిన్నంగా స్పందిస్తున్నారు. ఈ సినిమాలో సమంత శాకుంతలగా కనిపిస్తోంది. అయితే సమంత ఎక్స్ ప్రెషన్లు మాత్రం బాధగానే ఉన్నాయి. ఆమె మొహంలో సంతోష కళ ఎక్కడా కనిపించలేదు. అంతేకాకుండా ఈ సినిమాలో ఆమె ఎక్కువగా ఏడుస్తూ కనిపిస్తారనే టాక్ కూడా వినిపిస్తోంది.

 

ఇకపోతే ఈ సినిమాలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా కనిపించబోతోంది. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ లో బన్నీ కూతురిని కూడా చూపించారు. అయితే దానిపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. బన్నీ కూతుర్ని ఇందులో సరిగ్గా చూపించలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరీ ఓవర్ గా చూపించారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -