Ashu Reddy: షాకింగ్ విషయాలను వెల్లడించిన అషురెడ్డి.. ఏం చెప్పారంటే?

Ashu Reddy: తెలుగు సినిమా తెర మీద కనిపించాలని, తమకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాలని ఎంతో మంది ఆశపడతారు. కానీ అందరికీ ఆ కలను సాకారం చేసుకునే అవకాశం దొరకదు. ఇక చేసేదేమీ లేక చాలామంది ఇండస్ట్రీకి దూరమైతే, కొందరు మాత్రం నిత్యం వార్తల్లో నిలుస్తూ ఎలాగోలా ఛాన్స్ కొట్టేయాలనే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి ప్రయత్నాల్లో ఉన్న యువ నటి, యాంకర్ అషురెడ్డి.

 

వెండి తెర మీద మెరుద్దామని అనుకొని, జూనియర్ సమంతగా బుల్లితెర మీద ఆ మధ్యన హడావిడి చేసిన అమ్మడు అషురెడ్డి. సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేస్తూ ఎప్పుడూ నెటిజన్ల నోళ్లలో నానే అషురెడ్డి.. మంచి పాపులారిటీని సంపాదించుకుంది.

 

అషురెడ్డికి సినిమా అవకాశాలు లేకపోగా, బుల్లితెర మీద కూడా ఆమెకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. దాంతో స్కిన్ షోతో ఎలాగైనా అందరి దృష్టిని ఆకర్షించాలని గ్లామర్ షో చేస్తోంది. అయితే తాజాగా అషురెడ్డి రియల్ లైఫ్ కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. రియల్ లైఫ్ లో తనను ఒకతను మోసం చేసినట్లు అషురెడ్డి తెలిపింది.

 

తాను ఒక అబ్బాయిని ఇష్టపడే దానిని అని, అతడు తనను ఎప్పుడ కలిసినా నుదుటి మీద ముద్దు పెట్టే వాడని అషురెడ్డి వివరించింది. ఎలాగోలా ఈ విషయం ఇంట్లో వాళ్లకు తెలిసిందని, వాళ్లు ముందు చదువు పూర్తి చేయమని అడిగారని.. దాంతో ఇద్దరం కలిసి అమెరికా వెళ్లి చదువుకుందాం అని అనుకున్నట్లు తెలిపింది. కానీ అతడు తనతో రాలేదని, తాను చదువు పూర్తి చేసుకొని తిరిగి వచ్చాక అతడిలో మార్పును గమనించినట్లు అషురెడ్డి తెలిపింది. అతడు తనను వాడుకొని వదిలేసినట్లు అర్థమైందని, అందుకే అతడిని దూరం పెట్టినట్లు వివరించింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -