Ashu Reddy: ఖరీదైన బెంజ్ కారును బహుమతిగా అందుకున్న అషు రెడ్డి!

Ashu Reddy: అషు రెడ్డి పరిచయం అవసరం లేని పేరు సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత సోషల్ మీడియా వేదికగా ఈమెలో ఉన్న టాలెంట్ బయట పెడుతూ చేసినటువంటి టిక్ టాక్ వీడియోలు, డబ్ స్మాష్ వీడియోల ద్వారా అత్యంత ఆదరణ సంపాదించుకొని నేడు ఇండస్ట్రీలో సెలబ్రిటీగా కొనసాగుతున్నారు.ఈ క్రమంలోనే ఈమె అచ్చం సమంత పోలికలతో ఉండటం వల్ల ప్రతి ఒక్కరు జూనియర్ సమంత అంటూ ఈమెను ఇండస్ట్రీలో బాగా ప్రోత్సహించారు.

ఇలా నిత్యం సోషల్ మీడియా వేదికగా ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న అషు రెడ్డి ఏకంగా బిగ్ బాస్ అవకాశం అందుకున్నారు.ఇలా సీజన్ ఫోర్ లో కంటెస్టెంట్ గా పాటిస్పేట్ చేస్తున్న ఈమె ఈ కార్యక్రమం అనంతరం దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ తనకి భారీ గుర్తింపు తీసుకువచ్చింది. ఇలా సీజన్ ఫోర్ లో మాత్రమే కాకుండా నాన్ స్టాప్ సీజన్లో కూడా కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి అషు రెడ్డి ప్రస్తుతం ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఒకవైపు సినిమా అవకాశాలను అందుకుంటున్న మరోవైపు సోషల్ మీడియా వేదికగా ఎన్నో వీడియోలు రీల్స్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు. ఇకపోతే ఈ బ్యూటీ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా అషు సోషల్ మీడియా వేదికగా ఓ ఖరీదైన కొత్త కారుతో దిగిన ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోలను చూస్తుంటే ఈమె కొత్త కారు కొన్నట్టు అందరికీ అర్థమవుతుంది.

అయితే ఈ కారును తాను కొనలేదని తన పుట్టినరోజు సందర్భంగా తన తండ్రి 72 లక్షల విలువ చేసే ఖరీదైన బెంజ్ కార్ తనకు బహుమతిగా ఇచ్చారని తెలియజేశారు. ఈ సంవత్సరంలో తన అందుకున్న బెస్ట్ సర్ప్రైజ్ గిఫ్ట్ అంటూ తన తండ్రితో పాటు కారు దగ్గర దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తపరిచారు.ఇలా ఈమె షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ కావడంతో ఎంతోమంది అభిమానులు తనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

1

2

3

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -