Ashu Reddy: అషు, సురేఖావాణి నిజస్వరూపం ఇదేనా.. అసలేం జరిగిందంటే?

Ashu Reddy: కేపీ చౌదరి డ్రగ్స్ కేసు ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో దుమారం రేపుతోంది. అంతేకాకుండా ఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. కేపీ చౌదరి డగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొందరు సెలబ్రిటీలకు భయం పట్టుకుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అని చాలామంది సెలబ్రిటీలు భయం భయంగా గడుపుతున్నారు. కేపీ చౌదరిని పోలీసులు 2 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారో, అప్పుడిక చాలామంది తమ పనైపోయిందని భావించారు. ఇక అందరి అనుమానాలను నిజం చేస్తూ తాజాగా పోలీసులు చౌదరిని విస్తరించగా అనేక విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

కేపీ చౌదరి కాల్ లిస్ట్ నుంచి 12 మంది నటీనటుల కాంటాక్టులు వెలికితీశారు పోలీసులు. కేపీ చౌదరితో సంబంధం ఉన్న వారిలో అషు రెడ్డి, సురేఖ వాణి ల పేర్లు కూడా ఉన్నాయి..కొన్ని వందల సార్లు కేపీ చౌదరి ఫోన్ లో మాట్లాడాడు. మొదటి ఈ విషయం గురించి ప్రశ్నించగా తప్పించుకునే ప్రయత్నం చేయడంతో పాటు ఆ సెలబ్రిటీల పేర్లు బయటకు చెప్పకుండా ఉండేందుకు ప్రయత్నించాడు కేపీ చౌదరి. తాను కూడా ఒక నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నని, నటీనటులతో తరచుగా మాట్లాడితే తప్పేంటని రివర్స్ లో పోలీసుల్ని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. డ్రగ్స్ ని సెలబ్రిటీలకు సరఫరా చేయలేదని తను డ్రగ్స్ తీసుకుంటున్న విషయాన్ని అంగీకరించాడు కేపీ చౌదరి.

 

పట్టుబడిన డ్రగ్స్ అన్నీ తను వాడడం కోసమే గోవా నుంచి తెచ్చుకున్నట్లు వెల్లడించాడు.
మరోవైపు కేపీ చౌదరి ఎకౌంట్ లో అనుమానాస్పదంగా ఉన్న 11 ట్రాన్సాక్షన్లను గుర్తించారు పోలీసులు. వాటిపై కూడా ప్రశ్నలు గుప్పించారు. వీటికి కూడా సగం సగం సమాధానాలిచ్చాడట చౌదరి. మొత్తమ్మీద కేపీ చౌదరి 2 రోజుల కస్టడీ ముగిసింది. తిరిగి అతడ్ని చర్లపల్లి జైలుకు తరలించారు. పూర్తిస్థాయిలో ఆధారాలు కోర్టుకు సమర్పించి, మరోసారి కేపీ చౌదరిని పోలీసులు కస్టడీ కోరే అవకాశం ఉంది. దీంతో పాటు చౌదరి కాల్ లిస్ట్ లో ఉన్న నటీనటులకు సమన్లు జారీ చేసే అంశాన్ని కూడా సీరియస్ గా పరిశీలిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -