Ashu Reddy: వైరల్ అవుతున్న అషురెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Ashu Reddy: నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసు తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి ముఖ్యంగా కేపీ చౌదరితో టాలీవుడ్లో పలువురు సెలబ్రిటీలు టచ్ లో ఉండడంతో ఈ విషయం కాస్త సెన్సేషన్ గా మారింది. పోలీసులు అతన్ని కాస్త లోతుగా విచారించడంతో చాలామంది సెలబ్రిటీల పేర్లు బయటకు వచ్చాయి. అంతేకాకుండా ఆయా సెలబ్రిటీలతో మాట్లాడిన వందల ఫోన్ కాల్స్ కూడా బయటకు వచ్చాయి. కేపీ ఫోన్ కాల్ డాటాలో వందల మంది సెలబ్రిటీల ఫోన్ నంబర్లు ఉన్నట్టు విచారణ అధికారులు గుర్తించారు.

కాగా కేపీతో సంబంధాలు కలిగి ఉన్న సెలబ్రిటీల జాబితాను ఇప్పటికే పోలీసులు తయారు చేశారని ఇందులో అనుమానితులైన వారిని విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే కేపీతో సంబంధాలున్న ముగ్గురు తారలు అంటూ అషురెడ్డి- జ్యోతి సురేఖావాణి పేర్లను ప్రముఖంగా మీడియా హైలైట్ చేయడంతో వారు మీడియాకి వివరణ ఇచ్చే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా అషురెడ్డి తనపై సాగుతున్న ప్రచారాన్ని ఇన్ స్టా వేదికగా ఖండించారు. కొందరితో నా స్నేహాలను కొన్ని మీడియాలు పూర్తిగా తప్పుడుగా ప్రచారం చేసాయి. నేను ఈ వార్తలను ఖండిస్తున్నాను. సంబంధిత వ్యక్తులకు తెలుసు నిజమేంటో.

 

అలాగే నా ఫోన్ నంబర్ ని పబ్లిగ్గా పోస్ట్ చేయడం క్షమించరాని నేరం అంటూ అషురెడ్డి కాస్త ఘాటుగా స్పందించింది. అయితే అషు చెప్పినట్టుగా కేపీ చౌదరికి తనకు మధ్య కేవలం స్నేహం బంధం మాత్రమే ఉందా, లేకపోతే డ్రగ్స్ తీసుకొని కూడా పట్టుబడడంతో తప్పించుకోవడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతుందా అన్నది తెలియాలి అంటే ఈ కేసులో మరిన్ని వివరాల్లో తెలిసేంతవరకు వేచి చూడాల్సిందే మరి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -