Samantha: స్టార్ హీరోయిన్ సమంత నాకు తల్లిలాంటిది.. ఈ అసిస్టెంట్ ప్రేమకు ఆశ్చర్యపోవాల్సిందే!

Samantha: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లతో సమంత పేరు కూడా ఒకటి. ఇటీవల కాలంలో తరచూ ఏదో ఒక విషయంతో సమంత పేరు సోషల్ మీడియాలో మారుమోగుతూనే ఉంది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంతపై ట్రోలింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. అందరూ పనిగట్టుకుని మరి ఆమె పేరును వైరల్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఇక ఆ సంగతి అటు ఉంచితే సామ్ గత రెండు సినిమాలైన యశోద,శాకుంతలం సినిమాలు డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక తాజాగా సమంత ఖుషి సినిమాతో ప్రేక్షకులను పలకరించింది..

ఈ సినిమాతో సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది సమంత. వరుసగా రెండు ఫ్లాపులతో సతమతమవుతున్న సమంత ఈ సినిమాతో ఊపిరి పీల్చుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా సమంత గురించి ఆమె అసిస్టెంట్ ఆర్యన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా ఆర్యన్ మాట్లాడుతూ.. గుంటూరు నుంచి ఉపాధి కోసం ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్ వచ్చాను. మొదట్లో అనేక పనులు చేశాను స్నేహితుల కలువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కొందరు నటుల వద్ద అసిస్టెంట్ గా కూడా పనిచేశాను. ఆ తర్వాత సమంత వద్ద అసిస్టెంట్గా చేరాను.

దూకుడు సినిమా సమయంలో కొత్తగా టీవీఎస్ అపాచీ బైక్ కొన్నాను. ఆ బైక్ కొనడానికి కూడా నాకు సమంత మేడం హెల్ప్ చేశారు. ఆమె నాకు తల్లి లాంటిది. నేను ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తర్వాత దాదాపు ఆరేళ్లకు బైకు వేసుకుని ఇంటికి వెళ్లాను. ఆ బైక్ లోనే నాతో పాటు సమంత మేడం కూడా ప్రయాణించారు. ఆ జ్ఞాపకాలు ఆ మధురమైన అనుభూతులు ఎప్పటికీ మర్చిపోలేను. అలాగే ఎల్జీ ఫోన్ కొనుక్కునేందుకు సాయం చేసింది. అంతేకాదు, మణికొండలో తాను 3 బీహెచ్ కే ఇల్లు కొనుక్కోవడానికి సమంత తోడ్పాటు అందించారు అని చెప్పుకొచ్చాడు ఆర్యన్. నా జీవితంలో దేవుడు గురించి మాట్లాడాల్సి వస్తే, అది సమంత మేడమ్ గురించేనని ఆర్యన్ వెల్లడించాడు. నాకు కొడుకు పుట్టిన సమయంలో జాను సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉండి కూడా నా కొడుకుని చూడడానికి మేడం వచ్చారు. నిజంగా నేను అది ఎప్పటికీ మర్చిపోలేను అంటూ సమంతను ప్రశంసలతో ముంచేత్తారు ఆర్యన్.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -