Venu Swamy: బాలయ్య అలాంటివాడు అంటూ వేణు స్వామి షాకింగ్ కామెంట్స్!

Venu Swamy: తెలుగు ప్రేక్షకులకు నందమూరి బాలకృష్ణ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. బాల నటుడుగా అడుగుపెట్టిన బాలయ్య ప్రస్తుతం టాలీవుడ్లో అగ్రస్టార్ హీరోగా ఒక రేంజ్ లో వెలిగిపోతున్నాడు. ఇక బాలయ్య తన ప్రత్యేకమైన మాస్ యాటిట్యూడ్ తో ఎంతోమంది కుర్రకారును ఆకట్టుకున్నాడు.

మొత్తానికి బాలయ్య తెలుగు ఇండస్ట్రీలో నటుడుగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇదిలా ఉంటే జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి అందరికీ తెలిసిందే. సెలబ్రెటీల జాతకాలను చెప్పేస్తూ సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తూ ఉంటాడు. ఇక ఇదే క్రమంలో వేణు స్వామి తాజాగా బాలకృష్ణ గురించి కొన్ని కీలక విషయాలు బయటపెట్టాడు.

తనకు బాలకృష్ణ బాగా తెలుసని చెప్పకొచ్చాడు. అంతేకాకుండా బాలకృష్ణ సినిమాలకి తానే ముహూర్తం పెడతాను అన్నట్లు తెలియజేశాడు. ఇక బాలకృష్ణ చాలా గౌరవంగా పద్ధతిగా మాట్లాడుతారని చెప్పుకు వచ్చాడు. అంతేకాకుండా తాను చేయబోయే సినిమాల్లో ఏం జరుగుతుందో చెప్తే.. కొన్ని రోజుల తర్వాత కాల్ చేసి అవి జరిగాయి అంటూ తెలిపినట్లు వేణు స్వామి వెల్లడించాడు.

ఇక అందరిలా ఆయన మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి పెట్టుకుని మాట్లాడరు అని తెలిపారు. ఏదైనా ముక్కు సూటిగా మాట్లాడతారు అన్నట్లు వేణు స్వామి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బాలకృష్ణ గురించి వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. మరి వేణు స్వామి మాటలకు బాలకృష్ణ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.

ప్రస్తుతం బాలకృష్ణ రాబోయే సినిమాల విషయానికొస్తే.. డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న NBK 107 కాగా ఈ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంతేకాకుండా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎన్.బి.కె 108 ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ రెండు సినిమాలతో బాలయ్య ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తాడో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -