Chevella: దారుణం.. మూడు నెలల చిన్నారితో పాటు దంపతుల ఆత్మహత్య?

Chevella: ఇటీవల కాలంలో చాలామంది చిన్న చిన్న విషయాలకే ఊహించని విధంగా పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకొని ప్రాణాలను తీసుకోవడం లేదంటే ఎదుటి వ్యక్తులను చంపడం లాంటివి చేస్తున్నారు.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా కుటుంబ ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. కుటుంబంలోని పెద్దలతో పాటు పాటు చిన్నారుల ఆత్మహత్యల కేసులు కలవర పెడుతున్నాయి. కుటుంబంలో చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకొని చిన్నారులను చంపేసి అనంతరం తల్లిదండ్రులు కూడా చనిపోతున్నారు.

తాజాగా అటువంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో తాజాగా మంగళవారం రోజున దారుణ ఘటన చోటు చేసుకుంది. దేవరపల్లి గ్రామంలో ఒక మూడేళ్ల చిన్నారికి ఉరివేసి అనంతరం భార్యభర్తలు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు. దేవరపల్లికి చెంది అశోక్ ఏడాదిన్నర క్రితం అంకిత అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు మూడు నెలల క్రితం పాప కూడా జన్మించింది. ఈ మద్యనే అశోక్ సోదరికి వివాహం నిశ్చయమైంది. నిశ్చితార్థం ఏర్పాట్లు చూసుకునేందుకు పాపతో అంకిత గురువారం దేవరపల్లికి చేరుకుంది.

 

సోమవారం రాత్రి అశోక్ ఆయన తమ్ముడు రాఘవేంద్ర ఆటోలో కూరగాయల మార్కెట్ కి వెళ్లి సామాన్లు కొనుక్కొని తెల్లవారుజామున 4 గంటలకు ఇంటికి వచ్చారు. వారితో పాటు తెచ్చుకున్న బిర్యాని తిన్న తర్వాత తమ్ముడు రాఘవేంద్ర అక్కడ నుంచి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత అశోక్ టీవీ సౌండ్ ఎక్కువగా పెట్టి మొదట మూడు నెలల చిన్నారిని ఉరివేసి చంపాడు. ఆ తర్మాత దంపతులిద్దరూ ఫ్యాన్ కి ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఎంతకీ టీవీ సౌండ్ తగ్గించకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి అశోక్ ఇంటి తలుపు కొట్టగా తలుపులు తీయకపోవడంతో బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా చిన్నారి, అంకిత అప్పటికే చనిపోయారు. అశోక్ ని దించి ఆస్పత్రికి తరలించేలోపే అశోక్ కూడా చనిపోయాడు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే చిన్నారి సహా దంపతులు ఎందుకు ఉరి వేసుకున్న విషయంపై కారణాలు తెలియరాలేదు. ఆ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -