Akhil Akkineni: అక్కినేని అఖిల్ పై దారుణమైన ట్రోలింగ్.. పరువు మొత్తం పోయేలా?

Akhil Akkineni: అక్కినేని వారసుడు అఖిల్ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.ఈయన అఖిల్ సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అనంతరం హలో మజ్ను వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా ఈయన నటించిన సినిమాలేవి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా పరవాలేదు అనిపించుకుంది అయితే ఈ సినిమా కూడా పూజ హెగ్డే ఉండడం వల్లే సక్సెస్ అయిందని ఈ విజయం పూజా హెగ్డే ఖాతాలో పడింది.

ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ ఎన్నో అంచనాలు నడుమ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరికెక్కిన ఏజెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సినిమాని భారీ స్థాయిలో ప్రమోషన్ చేశారు.అయితే ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా కథలో కంటెంట్ లేకపోయినా భారీగా ప్రమోషన్లలో సినిమాకి హైప్ తీసుకోవచ్చారంటూ పలువురు ఈ సినిమాపై కామెంట్లు చేస్తున్నారు.

 

ఇలా ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ కావడంతో అఖిల్ గురించి పలువురు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు అఖిల్ ఇకపై సినిమాలు చేయడం మానేసి తమ తండ్రి వ్యాపారాలు చూసుకోవడం ఎంతో మంచిది అంటూ కొందరు అఖిల్ గురించి తెలియజేస్తున్నారు. అలాగే మరికొందరు ఈయన సినిమాలు చూసి వచ్చే తలనొప్పిని పోగొట్టుకోవడానికి జండుబాంకే ఎక్కువ ఖర్చులు పెట్టాల్సి వస్తుందని కామెంట్ చేస్తున్నారు. మీరు సినిమాలు తీయడం మానేస్తే కనీసం మాకు జండుబాం ఖర్చు అయినా మిగులుతుంది అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

 

అఖిల్ హీరో కటౌట్ అయినప్పటికీ ఆయన నటన వల్ల సక్సెస్ కాలేకపోతున్నారా లేక ఆయన దురదృష్టమా అర్థం కాలేదు లేకపోతే కథల ఎంపిక విషయంలో అఖిల్ సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదో తెలియదు కానీ ఈయన చేసిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్ కావడంతో పలువురు ఇలా అఖిల్ ను భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.రిజల్ట్ తర్వాత అఖిల్ తన సినిమాల విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు. ఒకవేళ సినిమాలు చేస్తే తదుపరి ఏ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నారనే విషయాలు తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -