Avika Gor: చిన్నారి పెళ్లికూతురు చేసిన పని తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

Avika Gor: “చిన్నారి పెళ్లికూతురు” గా బుల్లితెర ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన క్యూట్ హీరోయిన్ అవికా గోర్. కొంచెం వయసొచ్చాక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. “ఉయ్యాలా జంపాల” చిత్రంలో రాజ్ తరుణ్ తో మొదటి సినిమా చేసి మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత వరుసగా “సినిమా చూపిస్తమావ” “ఎక్కడికిపోతావు చిన్నవాడా” లాంటి సూపర్ హిట్ చిత్రాలు అవికా గోర్ ఖాతాలో పడిపోయాయి. అయితే ఇటీవల అవికా గోర్ కి సరైన విజయం లేదు. దీనితో ప్రస్తుతం నటిస్తున్న కొన్ని సినిమాలపైనా బాగా ఆశలు పెట్టుకుంది అవికా.

 

అయితే మొదటి నుండి ఈ చిన్నారి పెళ్లి కూతురు వెండితెరపై గ్లామర్ షో చాలా తక్కువగా చేసేది. తన హద్దుల్లోనే ఉంటూ క్యూట్ లుక్స్, నటనతో మెప్పిస్తూ వస్తోంది. అలాగే “రాజుగారి గది 3” లో హర్రర్ పాత్రలో కూడా బాగా మెప్పించింది అవికా. అయితే గ్లామర్ షో లేనిదే పాపులర్ అవ్వలేము అని గ్రహించిందో ఏమో తెలియదు గానీ.. ప్రస్తుతం గ్లామర్ పై ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇటీవల సోషల్ మీడియాలో వరుసగా గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ నెటిజన్లని ఊరిస్తోంది. ఇప్పటి వరకు అవికా గోర్ చిలిపి పిల్లలా కనిపిస్తూ క్యూట్ నెస్ తో కట్టిపడేస్తూ వచ్చింది. ఇలా అవికా తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది.

 

అవికా క్యూట్ నెస్ మొదట బాగానే పనిచేసినా ఇప్పుడు మాత్రం కేవలం అదొక్కటే అవకాశాలు తెచ్చేలా లేదు. కావున ఇప్పుడు అవికా తనలోని కొత్త యాంగిల్ ని బయట పెట్టింది. క్యూట్ గానే కాదు మతిపోగోట్టే హాట్ నెస్ తో, తానూ గ్లామర్ రోల్స్ కి కూడా సిద్దమే అన్నట్లుగా అవికా సంకేతాలు పంపుతోంది. ఇటీవల అవికా ఇన్ స్టా లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బ్లూ డ్రెస్ లో కళ్ళు చెదిరే అందాలతో మతి పోగొడుతోంది. ఈ చిన్నారి పెళ్లి కూతురి హాట్ స్ట్రక్చర్ కి నెటిజన్లు ఫిదా అయిపోయారు.

 

డిఫెరెంట్ స్టయిల్స్ లో తన ఎద సోయగాలతో మతి పోగొడుతోంది. ఇదివరకు ఎప్పుడు లేనట్టుగా అవికా ఫోజులు ఈ పోస్ట్ లో ఉన్నాయి. అయితే ఈ ఫొటోలతో అవికా గోర్ ను చుసిన వారు.. అవికా గోర్ ముఖం, పెదవులు విభిన్నంగా ఉన్నాయని అంటున్నారు. ఇదివరకు కంటే తన పెదవులు డిఫెరెంట్ గా ఉన్నాయని అంటున్నారు. దీనితో అవికా పెదవులకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లుక్ కోసం అవికా సర్జరీ చేయించుకుందేమో? అని అనుమానిస్తున్నారు నెటిజెన్స్.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -